MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Automobile
  • Cars
  • Tata EV Discounts: టాటా ఈవీ కార్లపై రూ.3.35 లక్షల వరకు తగ్గింపు ఆఫర్లు.. డోంట్ మిస్ !

Tata EV Discounts: టాటా ఈవీ కార్లపై రూ.3.35 లక్షల వరకు తగ్గింపు ఆఫర్లు.. డోంట్ మిస్ !

Tata EV Discounts: టాటా కార్ల పై బిగ్ ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి. టాటా మోటార్స్ ఆగస్టు ఆఫర్లలో భాగంగా కర్వ్ ఈవీ పై ఏకంగా రూ.3.35 లక్షల వరకు భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. టాటా కార్ల పై అందుబాటులో ఉన్న తగ్గింపు ఆఫర్ల వివరాలు మీకోసం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 05 2026, 03:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కొత్త ఈవీ కార్ కొంటున్నారా? టాటా మోటార్స్ ఆగస్టు ధమాకా ఆఫర్లు ఇవే!
Image Credit : Asianet News

కొత్త ఈవీ కార్ కొంటున్నారా? టాటా మోటార్స్ ఆగస్టు ధమాకా ఆఫర్లు ఇవే!

ఈ ఆగస్టు లో కొత్త ఎలక్ట్రిక్ కార్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు టాటా మోటార్స్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. తన ఎలక్ట్రిక్ పాసింజర్ వెహికల్స్ రేంజ్‌పై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. మోడల్, వేరియంట్‌ను బట్టి ఈ ఆఫర్లు రూ.45,000 నుండి ఏకంగా రూ.3.35 లక్షల వరకు అందుబాటులో ఉన్నాయి. ఇందులో క్యాష్ డిస్కౌంట్లు, ఫ్రీడమ్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, స్క్రాపేజ్ ఇన్సెంటివ్‌లతో పాటు పాత టాటా కస్టమర్ల కోసం ప్రత్యేక రాయితీలు కూడా ఉన్నాయి. ఆగస్టు 31 వరకు మాత్రమే ఈ ఆఫర్లు చెల్లుబాటులో ఉంటాయి. మోడల్ వారీగా ఆఫర్ల పూర్తి వివరాలు గమనిస్తే..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
టాటా కర్వ్ ఈవీ: అత్యధికంగా రూ.3.35 లక్షల బెనిఫిట్స్
Image Credit : tata motors

టాటా కర్వ్ ఈవీ: అత్యధికంగా రూ.3.35 లక్షల బెనిఫిట్స్

ఈ ఆగస్టు నెల ఆఫర్లలో టాటా కర్వ్ ఈవీ (Tata Curvv EV) టాప్‌లో నిలిచింది. దీని నాన్-ఎక్స్ ట్రిమ్ వేరియంట్‌పై గరిష్ఠంగా రూ.3.35 లక్షల వరకు ప్రయోజనం పొందవచ్చు. ఇందులో రూ.3 లక్షల క్యాష్ డిస్కౌంట్‌తో పాటు రూ.35,000 స్క్రాపేజ్ ఇన్సెంటివ్ ఉన్నాయి. ఇక కర్వ్ ఈవీ క్రియేటివ్ ట్రిమ్‌పై రూ.2.50 లక్షల క్యాష్ డిస్కౌంట్‌తో కలిపి మొత్తం రూ.2.85 లక్షల వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే ఎక్స్ సిరీస్ వేరియంట్లపై రూ.30,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా రూ.35,000 స్క్రాపేజ్ బెనిఫిట్, అలాగే పాత టాటా పెట్రోల్/డీజిల్ లేదా ఈవీ కస్టమర్ల కోసం రూ.30,000 లాయల్టీ బెనిఫిట్ లభిస్తుంది. మొత్తంగా ఎక్స్ వేరియంట్లపై రూ.65,000 వరకు బెనిఫిట్స్ పొందవచ్చు.

35
టాటా హారియర్ ఈవీ: రూ.2.75 లక్షల వరకు భారీ తగ్గింపు
Image Credit : tatamotors

టాటా హారియర్ ఈవీ: రూ.2.75 లక్షల వరకు భారీ తగ్గింపు

ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన టాటా హారియర్ ఈవీ పై కూడా టాటా మోటార్స్ భారీ ఆఫర్లను అందిస్తోంది. హారియర్ ఈవీ ఫియర్‌లెస్+, ఎంపవర్డ్ వేరియంట్లపై రూ.1 లక్ష ఫ్రీడమ్ ఆఫర్, రూ.50,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా రూ.75,000 స్క్రాపేజ్ ఇన్సెంటివ్ లభిస్తున్నాయి. అంతేకాకుండా పాత టాటా ఐసీఈ కస్టమర్లు ఈవీకి మారితే రూ.50,000, పాత టాటా ఈవీ కస్టమర్లు కొత్త హారియర్ ఈవీకి అప్‌గ్రేడ్ అయితే రూ.1 లక్ష లాయల్టీ బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. దీంతో గరిష్ఠంగా రూ.2.75 లక్షల వరకు ప్రయోజనం చేకూరుతుంది. అడ్వెంచర్ వేరియంట్‌పై రూ.75,000 ఫ్రీడమ్ ఆఫర్‌తో కలిపి మొత్తం రూ.2.50 లక్షల వరకు ఆఫర్లు లభిస్తున్నాయి.

45
టాటా పంచ్ ఈవీ, టియాగో ఈవీ: రూ.1.45 లక్షల వరకు ఆదా
Image Credit : our own

టాటా పంచ్ ఈవీ, టియాగో ఈవీ: రూ.1.45 లక్షల వరకు ఆదా

టాటా పంచ్ ఈవీ లాంగ్ రేంజ్ వేరియంట్‌పై గరిష్ఠంగా రూ.1.45 లక్షల వరకు లభిస్తుంది. ఇందులో రూ.1.10 లక్షల కన్స్యూమర్ ఆఫర్, రూ.30,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా రూ.35,000 స్క్రాపేజ్ ఇన్సెంటివ్ ఉన్నాయి. మీడియం రేంజ్ వేరియంట్‌పై రూ.1.25 లక్షలు, స్మార్ట్ ట్రిమ్‌పై రూ.95,000 వరకు బెనిఫిట్స్ ఉన్నాయి.

అటు టాటా టియాగో ఈవీ (Tata Tiago EV) పాత మోడల్ ఎల్‌ఆర్ ఎక్స్‌టీ వేరియంట్‌పై రూ.70,000 కన్స్యూమర్ ఆఫర్, రూ.50,000 ఫ్రీడమ్ ఆఫర్, రూ.20,000 ఎక్స్ఛేంజ్ బెనిఫిట్ లేదా రూ.25,000 స్క్రాపేజ్ ఇన్సెంటివ్‌తో కలిపి మొత్తం రూ.1.45 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. టియాగో ఈవీ ఎల్‌ఆర్ ఎక్స్‌జెడ్+ పై రూ.1.25 లక్షలు, మీడియం రేంజ్ వేరియంట్లపై రూ.65,000 వరకు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

55
టాటా నెక్సాన్ ఈవీ: రూ.45,000 బెనిఫిట్స్
Image Credit : tata motors

టాటా నెక్సాన్ ఈవీ: రూ.45,000 బెనిఫిట్స్

టాటా మోటార్స్ పోర్ట్‌ఫోలియోలో పాపులర్ అయిన టాటా నెక్సాన్ ఈవీ (Tata Nexon EV) పై ఈ నెలలో తక్కువ ఆఫర్లు ఉన్నాయి. ఈ మోడల్‌పై రూ.10,000 కన్స్యూమర్ డిస్కౌంట్, రూ.25,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా రూ.35,000 వరకు స్క్రాపేజ్ ఇన్సెంటివ్‌లు లభిస్తున్నాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే నెక్సాన్ ఈవీ కొనుగోలుపై గరిష్ఠంగా రూ.45,000 వరకు లబ్ధి పొందవచ్చు. అయితే టాటా టిగోర్ ఈవీ (Tigor EV), సియెర్రా ఈవీ (Sierra EV) మోడళ్లకు ఈ ఆగస్టు 2026 డిస్కౌంట్లు వర్తించవు.

గమనిక: ఈ ఆఫర్లు, డిస్కౌంట్లు నగరం, డీలర్‌షిప్, స్టాక్ లభ్యతను బట్టి మారవచ్చు. ఖచ్చితమైన వివరాల కోసం మీ సమీప టాటా మోటార్స్ డీలర్‌ను సంప్రదించండి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Maruti Suzuki: మారుతి నుంచి మైండ్ బ్లాకింగ్ కారు.. రూ. 5 లక్షలకే 34KM మైలేజ్, 6 ఎయిర్‌బ్యాగ్స్
Recommended image2
EV Car: 10 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్‌.. ఏకంగా 1100కిలో మీట‌ర్ల మైలేజ్ ఇచ్చే ఎల‌క్ట్రిక్ కారు
Recommended image3
Hatchback Cars Sales: రూ. 4.99 లక్షల కారు దాటికి స్విఫ్ట్, బలేనో క్లీన్ స్వీప్.. నంబర్ 1 కార్ ఇదే
Related Stories
Recommended image1
Most Venomous Snakes: ఒక్కకాటుతో ఏనుగును కూడా చంపేసే స్నేక్.. ఇండియాలో టాప్ 5 విషపూరితమైన పాముల ఇవే
Recommended image2
CMF Clip Pro: నథింగ్ సీఎంఎఫ్ క్లిప్ ప్రో ఓపెన్ ఇయర్ బడ్స్ లాంచ్.. కేక పుట్టించే ఫీచర్లు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved