గుడివాడపై బాబు ఫోకస్: టీడీపీ పట్టుసాధించేనా?
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గుడివాడ అసెంబ్లీపై తెలుగు దేశం పార్టీ ఫోకస్ పెట్టింది.
గుడివాడపై బాబు ఫోకస్: టీడీపీ పట్టుసాధించేనా?
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గుడివాడ అసెంబ్లీ స్థానం పై తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు. గుడివాడ అసెంబ్లీ స్థానం నుండి కొడాలి నానిని ఈ దఫా ఓడించాలనే లక్ష్యంతో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు పావులు కదుపుతున్నారు. గత రెండు దఫాలుగా తనను ఓడించాలని చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని కొడాలి నాని గుర్తు చేస్తున్నారు.
also read:ప్రపంచంలోనే అతి ఎత్తైన బీ.ఆర్. అంబేద్కర్ విగ్రహం: జాతికి అంకితం చేయనున్న జగన్
గుడివాడపై బాబు ఫోకస్: టీడీపీ పట్టుసాధించేనా?
తెలుగు దేశం పార్టీని వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుడివాడ అసెంబ్లీ స్థానం నుండి రెండు దఫాలు విజయం సాధించారు. 1983, 1985 ఎన్నికల్లో ఈ అసెంబ్లీ స్థానాల్లో నందమూరి తారక రామారావు విజయం సాధించారు
also read:ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024: కాంగ్రెస్ వ్యూహాలివీ, కలిసొచ్చేనా?
గుడివాడపై బాబు ఫోకస్: టీడీపీ పట్టుసాధించేనా?
1989లో కాంగ్రెస్ అభ్యర్ధి కటారి ఈశ్వర్ కుమార్ ఈ స్థానం నుండి విజయం సాధించారు. 1994లో రావి శోభనాద్రి చౌదరి ఈ స్థానం నుండి తెలుగు దేశం పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. 1999లో రావి హరి గోపాల్ ఇదే స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా గెలుపొందారు. 2000లో రావి వెంకటేశ్వరరావు తెలుగు దేశం పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు.
also read:వై.ఎస్. షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు: సవాళ్లు ఇవీ
గుడివాడపై బాబు ఫోకస్: టీడీపీ పట్టుసాధించేనా?
2004 అసెంబ్లీ ఎన్నికల్లో రావి వెంకటేశ్వరరావుకు టీడీపీ టిక్కెట్టు దక్కలేదు. కొడాలి నానికి తెలుగు దేశం పార్టీ టిక్కెట్టు దక్కింది. తొలి ప్రయత్నంలోనే కొడాలి నాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2009లో కూడ మరోసారి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. 2009 తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొడాలి నాని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ (వైఎస్ఆర్‌సీపీ)కి జై కొట్టారు
గుడివాడపై బాబు ఫోకస్: టీడీపీ పట్టుసాధించేనా?
జగన్ పార్టీలో చేరిన తర్వాత తెలుగు దేశం పార్టీపై, చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసేవారు. కొడాలి నాని వైఎస్ఆర్‌సీపీ వైపు వెళ్తున్న విషయాన్ని గమనించిన తెలుగు దేశం పార్టీ 2014 ఎన్నికలకు ముందే మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావును తిరిగి రంగంలోకి దింపింది.
also read:వై.ఎస్.షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు: జగన్‌పై డైరెక్ట్ ఫైట్
గుడివాడపై బాబు ఫోకస్: టీడీపీ పట్టుసాధించేనా?
గుడివాడ రాజకీయాలకు దూరంగా ఉన్న రావి వెంకటేశ్వరరావుతో బాలకృష్ణ చర్చలు జరిపారు. దీంతో రావి వెంకటేశ్వరరావు తిరిగి యాక్టివ్ అయ్యారు. 2014లో గుడివాడ నుండి రావి వెంకటేశ్వరరావు తెలుగు దేశం అభ్యర్ధిగా బరిలోకి దిగారు. వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధి కొడాలి నాని చేతిలో రావి వెంకటేశ్వరరావు ఓటమి పాలయ్యారు.
also read:వై.ఎస్. షర్మిలకు కాంగ్రెస్ పగ్గాలు: నాడు తండ్రి, నేడు తనయ
గుడివాడపై బాబు ఫోకస్: టీడీపీ పట్టుసాధించేనా?
2019 ఎన్నికల ముందు తెలుగు దేశం పార్టీలో దేవినేని అవినాష్ చేరారు. విజయవాడ తూర్పు నుండి దేవినేని అవినాష్ పోటీ చేయాలని ఆసక్తి చూపారు. కానీ విజయవాడ తూర్పులో గద్దె రామ్మోహన్ రావుకే చంద్రబాబు టిక్కెట్టు ఇచ్చారు. దీంతో గుడివాడలో దేవినేని అనివాష్ ను చంద్రబాబు బరిలోకి దింపాడు. అయితే దేవినేని అవినాష్ ఓటమి పాలయ్యారు. 2019లో తెలుగు దేశం పార్టీ ఓడిపోయిన కొన్ని రోజులకే దేవినేని అవినాష్ తెలుగు దేశం పార్టీ వీడి వైఎస్ఆర్‌సీపీలో చేరాడు.
also read:వై.ఎస్. షర్మిలకు పగ్గాలు: కాంగ్రెస్ కు పూర్వవైభవం వచ్చేనా?
గుడివాడపై బాబు ఫోకస్: టీడీపీ పట్టుసాధించేనా?
2019లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ అధికారాన్ని కోల్పోయింది. వైఎస్ఆర్‌సీపీ అధికారం దక్కించుకుంది. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో కొడాలి నానికి చోటు దక్కింది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలుగు దేశం పార్టీని దెబ్బతీసేందుకు కొడాలి నాని వ్యూహత్మకంగా వ్యవహరించారు. చంద్రబాబుపై కొడాలి నాని ఉపయోగించిన భాషపై తెలుగు దేశం నేతలు అభ్యంతరం వ్యక్తం చేసిన సందర్భాలు కూడ లేకపోలేదు.
also read:స్కిల్ కేసు: 17 ఏ సెక్షన్ అంటే ఏమిటీ,ఏం చెబుతుంది?
గుడివాడపై బాబు ఫోకస్: టీడీపీ పట్టుసాధించేనా?
గుడివాడ నుండి కొడాలి నానిని అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చేయాలని చంద్రబాబు స్కెచ్ వేస్తున్నారని టీడీపీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. ఎన్‌టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని ఈ నెల 18న గుడివాడలో నిర్వహించిన టీడీపీ సభను నిర్వహించింది. ఎన్టీఆర్ వర్ధంతిని కొడాలి నాని కూడ నిర్వహించారు.
also read:పైలెట్ పై దాడిలో మరో ట్విస్ట్: కారణాలు వివరిస్తూ వీడియో పోస్టు చేసిన ప్యాసింజర్
గుడివాడపై బాబు ఫోకస్: టీడీపీ పట్టుసాధించేనా?
టీడీపీ,వైఎస్ఆర్‌సీపీ పోటా పోటీగా కార్యక్రమాలతో గుడివాడలో ఉద్రిక్తత నెలకొంది. తన వద్ద రాజకీయ ఓనమాలు నేర్చుకొన్న నాని తనకే పాఠాలు చెబుతున్నారన్నారు. అయితే చంద్రబాబు ఏమీ చేయలేరని కొడాలి నాని కౌంటరిచ్చారు
also read:భారత్‌లో ఏటా రూ. 70 లక్షల సంపాదన: ఏడు వృత్తులు ఇవే...
గుడివాడపై బాబు ఫోకస్: టీడీపీ పట్టుసాధించేనా?
కొడాలి నాని గుడివాడలో ఓడించాలని తెలుగు దేశం పార్టీ నాయకత్వం భావిస్తుంది. అయితే చంద్రబాబు ఎన్ని వ్యూహాలు పన్నినా తనదే విజయమని కొడాలి నాని ధీమాగా ఉన్నారు. అయితే ఈ దఫా గుడివాడ నుండి రావి వెంకటేశ్వరరావుకు టిక్కెట్టు కేటాయిస్తారా, వెనిగండ్ల రాముకు టిక్కెట్టిస్తారా అనే విషయమై పొలిటికల్ సర్కిల్స్ చర్చ సాగుతుంది. గుడివాడపై చంద్రబాబు వ్యూహం ఫలిస్తుందా లేదా అనేది ఎన్నికల ఫలితాలు తేల్చనున్నాయి.
also read:ఆంధ్రప్రదేశ్‌పై ఫోకస్: కాంగ్రెస్ టార్గెట్ అదే, రంగంలోకి షర్మిల?