ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024: కాంగ్రెస్ వ్యూహాలివీ, కలిసొచ్చేనా?


ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగే  అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యేక హోదాతో పాటు పలు అంశాలపై  కాంగ్రెస్ ఫోకస్ పెట్టనుంది.

 congress stratagies for Andhra Pradesh Assembly Elections  2024 lns

అమరావతి: కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ అధ్యక్ష బాధ్యతలను  వై.ఎస్. షర్మిలకు అప్పగించింది ఆ పార్టీ.ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగే  అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా  కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తుంది.  అసెంబ్లీ ఎన్నికలతో పాటే పార్లమెంట్ ఎన్నికలు కూడ జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో  మెరుగైన ఓట్లను రాబట్టుకోవాలని ఆ పార్టీ భావిస్తుంది. ఈ ఎన్నికల్లో కనీసం  15 శాతం ఓట్లను దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తుంది. 2014 నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  కాంగ్రెస్ పార్టీ ఉనికిలో లేకుండా పోయింది. దీంతో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు  కాంగ్రెస్ పార్టీ  నాయకత్వం వ్యూహాలు రచిస్తుంది. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే  తెలుగు దేశం జనసేలు కూటమిగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ (వైఎస్ఆర్‌సీపీ) పార్టీ ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది.

also read:వై.ఎస్. షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు: సవాళ్లు ఇవీ

అయితే  కాంగ్రెస్ పార్టీ  ఒంటరిగా పోటీ చేస్తుందా ,ఇండియా కూటమిలోని పార్టీలతో కలిసి పోటీ చేస్తుందా అనే విషయం ఇంకా స్పష్టత రాలేదు.  మరో వైపు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కూడ  తెలుగు దేశం, జనసేన కూటమిలో చేరుతుందా, ఒంటరిగా బరిలోకి దిగుతుందా అనేది తేలాల్సి ఉంది. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉన్న సమయంలో చేశారు. ఆ సమయంలో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి  కేంద్రం  హామీలు ఇచ్చింది. కానీ ఈ హామీలు అమలు కానీ విషయాలను కాంగ్రెస్ పార్టీ  త్వరలో జరగనున్న ఎన్నికల్లో  ప్రధాన ప్రచార అస్త్రాలుగా వినియోగించుకొనే అవకాశం లేకపోలేదు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అప్పట్లో హామీ ఇచ్చింది. ఎన్నికల్లో పార్టీలకు ప్రత్యేక హోదా అంశం  ఓట్లను కురిపించే అస్త్రంగా మారింది.  

ప్రత్యేక హోదాపై  ప్రధాన పార్టీలు  పరస్పరం విమర్శలు చేసుకొంటున్నాయి.  ప్రత్యేక హోదాకు సమానమైన ప్రత్యేక ప్యాకేజీని ఆనాడు చంద్రబాబు సర్కార్ తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే  విపక్షాల విమర్శలకు అప్పట్లోనే చంద్రబాబు సహా టీడీపీ నేతలు  కౌంటరిచ్చారు. 

also read:బీజేపీకి పురంధేశ్వరి, కాంగ్రెస్‌కు వై.ఎస్. షర్మిల: రెండు జాతీయ పార్టీలను లీడ్ చేస్తున్న ఉద్ధండుల కూతుళ్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక హోదా విషయాన్ని కాంగ్రెస్ పార్టీ మరోసారి లేవనెత్తే అవకాశం లేకపోలేదు.  తెలుగు దేశం, వైఎస్ఆర్‌సీపీ, బీజేపీలు  ప్రత్యేక హోదా విషయంలో ఏం చేశాయి, తాము ఏం చేయనున్నామో  ఆ పార్టీ ప్రజలకు వివరించే అవకాశం లేకపోలేదు. 

రాష్ట్ర విభజన  విషయంలో తమ పార్టీపై  ఉన్న  ఆరోపణలపై  కూడ  కాంగ్రెస్ పార్టీ కౌంటర్ చేసుకొనే అవకాశం లేకపోలేదు.  రాష్ట్ర విభజన విషయమై  ఏ పార్టీ అప్పట్లో  ఏం చెప్పిందనే విషయాలను కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రచారం చేసే అవకాశం లేకపోలేదు.

2024లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పట్లో ఇచ్చిన హమీల విషయంలో  కాంగ్రెస్ సర్కార్ సానుకూలంగా నిర్ణయాలు తీసుకొనే అవకాశాల గురించి ప్రస్తావించే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.మరోవైపు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పొందుపర్చిన అంశాల గురించి  కూడ కాంగ్రెస్ ప్రస్తావించే అవకాశాలు లేకపోలేదు.

విశాఖపట్టణం స్టీల్ ఫ్యాక్టరీ కార్మికులకు మద్దతుగా  త్వరలోనే  కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనుంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఈ సభలో పాల్గొంటారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  మూడు ప్రాంతాల్లో సభలను  కాంగ్రెస్ ఏర్పాటు చేయనుంది.  

also read:వై.ఎస్.షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు: జగన్‌పై డైరెక్ట్ ఫైట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  వైఎస్ఆర్‌సీపీలోని అసంతృప్తులు  కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. వైఎస్ఆర్‌సీపీతో పాటు  తెలుగు దేశం,జనసేన సీట్ల సర్దుబాటు కారణంగా టిక్కెట్లు దక్కని వారు  కూడ కాంగ్రెస్ వైపు  చూసే అవకాశాలను కొట్టి పారేయలేమనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

also read:వై.ఎస్. షర్మిలకు కాంగ్రెస్ పగ్గాలు: నాడు తండ్రి, నేడు తనయ

2014, 2019 ఎన్నికలతో పోలిస్తే  2024లో జరిగే  ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెరుగైన ఓట్లు, సీట్లు దక్కే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు.ఈ ఎన్నికల్లో  కనీసం  15 శాతం ఓట్లు సాధించాలనే టార్గెట్ గా ఆ పార్టీ పావులు కదుపుతుంది.  ఈ నెల  21న  వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టనుంది. కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై  ఆమె కార్యాచరణను సిద్దం చేయనుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios