పైలెట్ పై దాడిలో మరో ట్విస్ట్: కారణాలు వివరిస్తూ వీడియో పోస్టు చేసిన ప్యాసింజర్


ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఇండిగో విమానంలో  పైలెట్ పై  దాడి ఘటనలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది.
 

New Twist In Indigo Pilot Assault Incident: Co-Passenger Says 'Attack Was Wrong But Indigo Pilot Blamed Passengers For Delay' (Video)lns

 
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఇండిగో విమానం ఆలస్యంగా బయలు దేరే విషయంలో ఆలస్యం గురించి  ప్రకటన చేసే సమయంలో  ఓ ప్రయాణీకుడు  పైలెట్  దాడి చేసిన  వీడియో సోషల్ మీడియాలో వైరల్  గా మారింది. ఈ విషయమై  విమానంలోని ఓ ప్రయాణీకుడు  సోషల్ మీడియాలో తన వెర్షన్ ను పోస్టు చేయడంతో  సంఘటన మరో మలుపు తిరిగింది. ఈ విమానంలో ప్రయాణీస్తున్న  రష్యన్ -భారత నటి  మోడల్ ఎవ్జెనియా బెల్స్‌కియా సోషల్ మీడియాలో  ఓ వీడియోను పోస్టు చేశారు.  

 

ఢిల్లీ- గోవా  విమానం (6ఈ-2175) ఆదివారంనాడు ఉదయం ఏడున్నర గంటలకు  టేకాఫ్ కావాల్సి ఉంది.  అయితే  ఉదయం ఆరు గంటలకే  విమానాశ్రాయానికి చేరుకున్నామని  ఆమె ఆ వీడియోలో పేర్కొన్నారు. విమానం ఆలస్యమైందన్నారు.  దాదాపు 10 గంటలు ఎదురు చూసినట్టుగా  చెప్పారు. ఆ తర్వాత విమానంలోకి వెళ్లినట్టుగా తెలిపారు.  విమానంలో కూర్చున్న తర్వాత కూడ  రెండు నుండి మూడు గంటల పాటు వెయిట్ చేసినట్టుగా ఆమె ఆ వీడియోలో పేర్కొన్నారు. 

వీడియో మరింత ఆలస్యమైన విషయమై  ప్రయాణీకులు పూర్తిగా సహనం కోల్పోయారన్నారు.  ఈ విషయమై  ప్రయాణీకులు క్యాబిన్ సిబ్బందిని ప్రశ్నించడం ప్రారంభించారన్నారు. అదే సమయంలో విమానం ఇంకా ఆలస్యంగా బయలు దేరే విషయాన్ని పైలెట్ చెప్పారన్నారు.  ఈ విషయమై  ప్రయాణీకులు  పూర్తిగా తమ సహనాన్ని కోల్పోయారన్నారు.  అయితే ఈ సమయంలో ప్రయాణీకుడు పైలెట్ పై దాడి చేయడం తప్పేనని ఎవ్జెనియా బెల్స్‌కియా  అంగీకరించారు.

ఈ విషయమై  ప్రయాణీకులను రెచ్చగొట్టేలా వ్యవహరించారని ఆమె ఆరోపించారు. ఈ క్రమంలోనే  ప్రయాణీకులు  తమ సహనాన్ని కోల్పోయారన్నారు.ఢిల్లీ-గోవా ఇండిగో విమానం (6E-2175) పైలెట్ అనూప్ కుమార్  విమానం మరింత ఆలస్యంగా  బయలుదేరనుందని  ప్రకటించే సమయంలో ఓ ప్రయాణీకుడు అతడిపై దాడి చేశాడని ఎయిర్ లైన్స్ వర్గాలు ప్రకటించాయి.ఈ దృశ్యాలు వైరల్ గా మారాయి.  

అయితే దాడి చేసిన ప్రయాణీకుడితో పాటు  ఇతరులను విమాన సిబ్బంది శాంతింపజేసేందుకు యత్నించారు.  ఈ ఘటనపై  ఏవియేషన్ సెక్యూరిటీ ఏజెన్సీ అప్రమత్తమై విచారణ ప్రారంభించింది. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios