బీజేపీకి పురంధేశ్వరి, కాంగ్రెస్‌కు వై.ఎస్. షర్మిల: రెండు జాతీయ పార్టీలను లీడ్ చేస్తున్న ఉద్ధండుల కూతుళ్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు జాతీయ పార్టీలకు ఇద్దరు మహిళా నేతలు నాయకత్వం వహిస్తున్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు జాతీయ పార్టీలకు ఇద్దరు మహిళలు అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ అధ్యక్ష పదవిని 2023 జూన్ మాసంలో దగ్గుబాటి పురంధేశ్వరికి బీజేపీ అధ్యక్ష బాధ్యతలను ఆ పార్టీ అప్పగించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు స్థానంలో పురంధేశ్వరిని ఆ పార్టీ నియమించింది.
ఈ నెల 4వ తేదీన కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్‌టీపీని విలీనం చేసింది వై.ఎస్. షర్మిల. ఈ నెల 15న కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు.ఈ నెల 16వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష బాధ్యతలను వై.ఎస్. షర్మిలకు అప్పగించింది ఆ పార్టీ నాయకత్వం.
also read:వై.ఎస్.షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు: జగన్‌పై డైరెక్ట్ ఫైట్
ఈ ఇద్దరు మహిళా నేతలు రెండు జాతీయ పార్టీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలక బాధ్యతలు చేపట్టారు. దగ్గుబాటి పురంధేశ్వరి నందమూరి తారక రామారావు కూతురు. తెలుగు దేశం పార్టీని ఏర్పాటు చేసి 9 మాసాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టిన చరిత్ర నందమూరి తారక రామారావుది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీకి అధికారాన్నితీసుకురావడంలో కీలక పాత్ర వహించిన వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి కూతురే వై.ఎస్. షర్మిల. కాంగ్రెస్ పార్టీలో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి సుదీర్ఘకాలం పాటు పనిచేశారు. హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందే నాటికి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి.
also read:వై.ఎస్. షర్మిలకు కాంగ్రెస్ పగ్గాలు: నాడు తండ్రి, నేడు తనయ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల కూతుళ్లు రెండు ప్రధాన రాజకీయ పార్టీలకు నేడు నాయకత్వం వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో ప్రధాన పార్టీలు ఎన్నికలకు సన్నద్దమౌతున్నాయి.
ఈ తరుణంలోనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను వై.ఎస్. షర్మిలకు ఆ పార్టీ అప్పగించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉనికిలో లేకుండా పోయింది. అయితే ఈ ఎన్నికల్లో కనీసం 15 శాతం ఓట్లు సాధించాలనే లక్ష్యంతో ఆ పార్టీ ముందుకు సాగుతుంది.