Asianet News TeluguAsianet News Telugu

వై.ఎస్. షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు: సవాళ్లు ఇవీ

వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలిగా  ఆ పార్టీ నియమించింది. దీంతో  ఆ పార్టీని బలోపేతం చేసే బాధ్యతలు షర్మిలపై పడింది.

 Andhra Pradesh Assembly Elections 2024: challenges for  Y.S. Sharmila lns
Author
First Published Jan 17, 2024, 5:32 PM IST

అమరావతి: కాంగ్రెస్ పార్టీ  
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష పదవిని వై.ఎస్. షర్మిలకు ఆ పార్టీ అప్పగించింది.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంపై  వై.ఎస్. షర్మిల  ఫోకస్ చేయనున్నారు. 

కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  గట్టి పట్టుండేది.  కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కీలకంగా వ్యవహరించిన సందర్భాలు కూడ లేకపోలేదు. 1980లో  కేంద్రంలో  కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటులో  ఆంధ్రప్రదేశ్ కీలకంగా వ్యవహరించింది.  2004, 2009 ఎన్నికల్లో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నుండి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు  విజయం సాధించారు.ఈ ఎంపీలు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు  దోహదపడ్డారు. 

2014లో  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనతో  కాంగ్రెస్ పార్టీ  ఉనికిని కోల్పోయింది.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి సుమారు  పదేళ్లు కావొస్తుంది. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే బాధ్యతను  వై.ఎస్. షర్మిలకు కాంగ్రెస్ పార్టీ అప్పగించింది. 

ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.అయితే ఈ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ  కనీసం  15 శాతం  ఓట్లను సాధించాలనే లక్ష్యంతో  కాంగ్రెస్ పార్టీ  వ్యూహారచన చేస్తుంది. 

 వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో  వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి  యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్‌సీపీ) ని ఏర్పాటు చేశారు.  కాంగ్రెస్ ఓటు బ్యాంకు పూర్తిగా వైఎస్ఆర్‌సీపీ వైపునకు వెళ్లింది. 

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి  వై.ఎస్. షర్మిలను ఆ పార్టీ  ఎంచుకోవడం వ్యూహాంలో భాగమేనని  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  వైఎస్ఆర్‌సీపీ వైపునకు వెళ్లిన కాంగ్రెస్ ఓటు బ్యాంకును తిరిగి తమ వైపునకు తిప్పుకోవడం వై.ఎస్. షర్మిలకు  పెద్ద సవాల్.  

also read:స్కిల్ కేసు: 17 ఏ సెక్షన్ అంటే ఏమిటీ,ఏం చెబుతుంది?

ఈ ఏడాది ఏప్రిల్ లో  జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం  15 శాతం ఓట్లను దక్కించుకోవాలనే  లక్ష్యంతో ముందుకు వెళ్తుంది.  అయితే  నామమాత్రంగా ఉన్న ఓటు బ్యాంకు  15 శాతం దక్కించుకోవాలనే లక్ష్యంతో కాంగ్రెస్ వెళ్తుంది. అయితే  15 శాతం ఓటు బ్యాంకు దక్కించుకోవడం ఆషామాషీ వ్యవహరం కాదు.

also read:వై.ఎస్. షర్మిలకు కాంగ్రెస్ పగ్గాలు: నాడు తండ్రి, నేడు తనయ

కాంగ్రెస్ తో విబేధించిన సమయంలో  ఆ పార్టీపై  వై.ఎస్. షర్మిల  చేసిన విమర్శల గురించి ప్రత్యర్థులు  ఈ తరుణంలో లేవనెత్తే అవకాశం లేకపోలేదు. ఈ విషయమై  వై.ఎస్. షర్మిల ఎలా సమాధానం చెబుతుందోననేది ప్రస్తుతం ఆసక్తికరంగా  మారింది. ఈ విషయమై  షర్మిల చెప్పే  సమాధానానికి ప్రజలు కన్విన్స్ అయితే  కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా  ప్రయోజనం కలిగే అవకాశం ఉంది.  ఒకవేళ అదే జరగకపోతే  కాంగ్రెస్ పార్టీ  బలపడేందుకు  ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది.

also read:వై.ఎస్.షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు: జగన్‌పై డైరెక్ట్ ఫైట్

వైఎస్ఆర్‌సీపీ సహా ఇతర పార్టీల్లోని అసంతృప్తులకు కాంగ్రెస్ పార్టీ వైపు చూసే  అవకాశం కూడ లేకపోలేదు. అయితే ఇది ఒక రకంగా  ఆ పార్టీకి కలిసి రానుంది.  అయితే  కాంగ్రెస్ పార్టీలో ఇలా ఎంతమంది చేరుతారు, కాంగ్రెస్ లో చేరే నేతలు ఏ మేరకు ఆ పార్టీకి కలిసి వస్తారనేది కూడ పరిశీలించాల్సి ఉంది. 

also read:బీజేపీకి పురంధేశ్వరి, కాంగ్రెస్‌కు వై.ఎస్. షర్మిల: రెండు జాతీయ పార్టీలను లీడ్ చేస్తున్న ఉద్ధండుల కూతుళ్లు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో  మెరుగైన ఓట్లను సాధించడం  షర్మిల ముందున్న సవాళ్లు. అయితే  అసెంబ్లీ కంటే పార్లమెంట్ సీట్లపై  కాంగ్రెస్ ఫోకస్ చేస్తే ఆ పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios