ప్రపంచంలోనే అతి ఎత్తైన బీ.ఆర్. అంబేద్కర్ విగ్రహం: జాతికి అంకితం చేయనున్న జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రపంచంలోనే అతి ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఇవాళ జాతికి అంకితం చేస్తారు.
విజయవాడ: ప్రపంచంలో అతి ఎత్తైన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నాడు జాతికి అంకితం చేయనున్నారు. దీనికి స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని పేరు పెట్టారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 404 కోట్లతో అంబేద్కర్ స్మృతి వనాన్ని ఏర్పాటు చేసింది. విజయవాడ నగరంలో ఈ భారీ విగ్రహం ఏర్పాటు చేశారు. 18.18 ఎకరాల విశాల ప్రాంగణంలో అంబేద్కర్ స్మృతి వనాన్ని నిర్మించారు. ఈ నెల 20వ తేదీ నుండి అంబేద్కర్ స్మృతి వనానికి ప్రజలను అనుమతిస్తారు.
అంబేద్కర్ విగ్నహన్ని 81 అడుగుల బేస్ తో 125 అడుగుల ఎత్తుతో నిర్మించారు. పెడస్టల్ సైజు 3,481 చదరపు అడుగులు.పెడస్టల్ తో కలుపుకుంటే విగ్రహం ఎత్తు 206 అడగులు. జీ+ప్లస్ టూ అంతస్తుల్లో దీన్ని నిర్మించారు. ఈ విగ్రహనికి 400 మెట్రిక్ టన్నుల స్టీల్ ఉపయోగించారు. మరో వైపు ఈ విగ్రహానికి 120 మెట్రిక్ టన్నుల కాంస్యం వాడారు.2200 టన్నలు శాండ్ స్టోన్ ను ఉపయోగించారు.
సామాజిక న్యాయ మహా శిల్పంగా దీన్ని పిలుస్తున్నారు. ఎంఎస్ అసిసోయేట్ సంస్థ అంబేద్కర్ విగ్రహన్ని డిజైన్ చేసింది. ఈ విగ్రహం కోసం దేశీయ మెటీరియల్ ను వినియోగించారు.
అంబేద్కర్ స్మృతి వనంలో అందమైన గార్డెన్, వాటర్ బాడీస్, మ్యూజికల్ ఫౌంటెన్ ఏర్పాటు చేశారు. మరో వైపు రాత్రి పూట మిరుమిట్లుగొలిపేలా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు.
గంటకు 350 కి.మీ. వేగంత్ో గాలులు వీచినా కూడ ఈ విగ్రహనికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఇంజనీర్లు ప్రకటించారు. అంబేద్కర్ స్మృతివనాన్ని 30 మీటర్ల లోతులో, 539 పిల్లర్లతో నిర్మించారు. ముందు భాగం 166 పిల్లర్లతో కారిడార్ నిర్మించారు.
అంబేద్కర్ జీవితంలో చోటు చేసుకున్న ఘట్టాలు తెలిపేలా ఆర్ట్ వర్క్ ఏర్పాటు చేశారు.
2022 మార్చి 21న అంబేద్క్ర్ స్మృతి వనం పనులను ప్రారంభించారు. ఇవాళ ఈ విగ్రహన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు.
అంబేద్కర్ విగ్రహం బేస్ కింది భాగంలో గ్రౌండ్,ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లుంటాయి. గ్రౌండ్ ఫ్లోర్ లో నాలుగు హాల్స్ ఉంటాయి. ఇందులో అంబేద్కర్ జీవిత చరిత్రను తెలిపే డిజిటల్ మ్యూజియం ఏర్పాటు చేశారు.
ఫస్ట్ ఫ్లోర్ లో నాలుగు హాళ్లుంటాయి. అయితే ఇందులో అంబేద్కర్ జీవితంలో చోటు చేసుకున్న ఘట్టాలకు సంబంధించిన లైబ్రరీతో పాటు లైబ్రరీని ఏర్పాటు చేశారు. అంతేకాదు అంబేద్కర్ స్మృతి వనంలో 2 వేల మంది కూర్చొనేలా కన్వెన్షన్ సెంటర్ ను కూడ నిర్మించారు. అంతేకాదు ఫుడ్ కోర్టు కూడ ఏర్పాటు చేశారు. రెండేళ్ల పాటు మూడ షిప్టుల్లో 600 మంది కూలీలు ఈ పనులు చేపట్టారు.
స్టాట్యూ ఆఫ్ యూనిటీ పేరుతో ఏర్పాటు చేసిన సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహంగా పేరు పొందింది. అంబేద్కర్ విగ్రహల్లో ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం అతి పెద్దదిగా రికార్డు స్వంతం చేసుకోనుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడ 125 అడగుల ఎత్తులో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం పెడస్టల్ తో కలుపుకుంటే 206 అడుగులుంటుంది.