వై.ఎస్. షర్మిలకు కాంగ్రెస్ పగ్గాలు: నాడు తండ్రి, నేడు తనయ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీసీసీ అధ్యక్ష పదవిని వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి  చేపట్టారు. నేడు  వై.ఎస్. షర్మిలకు  ఆ పార్టీ  అప్పగించింది.

Y.S. Rajashekara Reddy Worked as PCC President twice, Now Y.S. Sharmila lns

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది.  కాంగ్రెస్ పార్టీ  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ అధ్యక్ష పదవిని వై.ఎస్. షర్మిలకు  కట్టబెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో మెరుగైన ఓట్లు సాధించాలనే లక్ష్యంతో  కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి  రెండు దఫాలు  పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి  తర్వాత  ఆయన కూతురు  వై.ఎస్. షర్మిల పీసీసీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు. 

also read:జనసేనలోకి ముద్రగడ?: కిర్లంపూడిలో పద్మనాభంతో భేటీకి పవన్

1983-85లో  వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు.  1998-2000 లో కూడ  వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి  రెండో దఫా  పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు.  1999 అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ  అధికారంలోకి రాలేదు.  వరుసగా రెండో దఫా అప్పట్లో  తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. 

also read:ఆంధ్రప్రదేశ్‌పై ఫోకస్: కాంగ్రెస్ టార్గెట్ అదే, రంగంలోకి షర్మిల?

1999లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో  సీఎల్పీ నేతగా వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి  వ్యవహరించారు.  సీఎల్పీ నేతగా ఉన్న సమయంలోనే  వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి  పాదయాత్రను ప్రారంభించారు. ఆ పాదయాత్ర కాంగ్రెస్ పార్టీకి  అప్పట్లో కలిసి వచ్చింది. తెలుగు దేశం పార్టీ అనుసరిస్తున్న విధానాలపై   పాదయాత్ర ద్వారా  వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ప్రజలను చైతన్యవంతుల్ని చేశారు.  ఈ పాదయాత్ర 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  అధికారంలోకి రావడానికి ఓ కారణంగా కూడ చెబుతారు.

also read:ఏపీ రాజకీయాల్లో సంచలనం: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు ఏమిటీ?

 రాష్ట్ర విభజనతో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  రాజకీయ పరిణామాలు  మారాయి.  కాంగ్రెస్ పార్టీ ఉనికిలో లేకుండా పోయింది. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు దాటింది. రాష్ట్రంలో  కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు  ఆ పార్టీ అడుగులు వేస్తుంది.  అయితే ఇప్పటికిప్పుడే కాంగ్రెస్ పార్టీకి  పూర్వ వైభవం వచ్చే పరిస్థితి ఉండకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే  రాష్ట్ర ప్రజలకు  వై.ఎస్. షర్మిల నమ్మకం కల్గిస్తే  ఆ పార్టీకి   భవిష్యత్తులో మంచి  అవకాశాలు ఉండే అవకాశాలను కొట్టిపారేయలేమని  రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

also read:వై.ఎస్. షర్మిలకు పగ్గాలు: కాంగ్రెస్ కు పూర్వవైభవం వచ్చేనా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి  ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ తో విబేధించి  యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు.  వైఎస్ఆర్‌సీపీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉంది.  కాంగ్రెస్ ఓటు బ్యాంకు  వైఎస్ఆర్‌సీపీ వైపు వెళ్లింది.ఈ ఓటు బ్యాంకును తిరిగి కాంగ్రెస్ వైపునకు రప్పించేందుకు  కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా పెట్టుకుంది.

 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios