కొన్ని కూరగాయల్లో సహజంగానే తేమ ఉంటుంది. వాటిని ఉడికించేటప్పుడు నీళ్ళు పోస్తే రుచి, పోషకాలు తగ్గిపోతాయి.

కొన్ని కూరగాయలను ఉడికించేటప్పుడు నీళ్ళు పోయకూడదు. కొన్ని కూరగాయల్లో సహజంగానే తేమ ఉంటుంది. వాటిని ఉడికించేటప్పుడు నీళ్ళు పోస్తే రుచి, రంగు, పోషకాలు - అన్నీ ప్రభావితం అవుతాయి. ఇప్పుడు అలాంటి కూరగాయల గురించి తెలుసుకుందాం. బెండకాయ, అరటికాయ, బ్రోకలీ లాంటి కూరగాయలకు కూడా నీళ్ళు పోయకూడదు.

నీళ్ళు లేకుండా ఉడికించాల్సిన 7 కూరగాయలు

1. ఆనపకాయ (Bottle Gourd)

  • ఆనపకాయ దీనినే చాలా మంది సొరకాయ అని కూడా పిలుస్తారు. దీనిలో దాదాపు 92% నీళ్ళు ఉంటాయి. ఉడికించేటప్పుడు దీని నుంచి సహజంగా నీళ్లు బయటకు వస్తాయి. ఈ కూర వండే సమయంలో పొరపాటున కూడా నీళ్లు పోయకూడదు.
  • నీళ్ళు పోస్తే రుచి, పోషకాలు తగ్గిపోతాయి. అలా నీళ్లు పోసి వండితే.. దానిని తినడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు.

2. వంకాయ (Brinjal)

  • వంకాయ కూర వండే సమయంలో కూడా నీళ్లు పోయకూడదు. దానిలో నుంచి నీరు వస్తుంది. ముఖ్యంగా ఉప్పు వేసి ఉడికిస్తే… వెంటనే నీళ్లు వస్తాయి.
  • నీళ్ళు పోస్తే జిగురుగా, రుచిలేకుండా అవుతుంది.

3. పుట్టగొడుగులు (Mushroom)

  • పుట్టగొడుగులు కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని కూడా నీళ్లు పోసి వండకూడదు. సహజంగానే ఇవి 85–90% నీళ్ళతో తయారవుతాయి. నూనెలో వేసి మూత పెడితే.. దీనిలో నుంచి నీరు వస్తుంది.
  • నీళ్ళు పోస్తే రుచి, టెక్స్చర్ రెండూ పాడవుతాయి.

4. పాలకూర, తోటకూర (Spinach, Amaranth, Bathua)

  • ఈ కూరల్లో సహజంగానే తేమ ఉంటుంది. ఉడికిస్తే నీళ్ళు వదులుతాయి.
  • నీళ్ళు పోస్తే చాలా లేతగా, రుచిలేకుండా అవుతాయి.

5. బీరకాయ (Ridge Gourd/Sponge Gourd)

  • ఇందులో కూడా చాలా తేమ ఉంటుంది.
  • నీళ్ళు పోస్తే రుచి పోతుంది.

6. కాబేజీ (Cauliflower)

  • కొంచెం నీళ్ళతో మూతపెట్టి ఉడికిస్తే చాలు.
  • నీళ్ళు పోస్తే ముక్కలు విడిపోతాయి, క్రంచ్ పోతుంది.

7. టమాటా (Tomato)

  • టమాట కూడా నీరు ఎక్కువగా ఉండే కూరగాయల. ముఖ్యంగా ఉల్లిపాయలు, మసాలాలతో ఉడికిస్తే… మంచి గ్రేవీలాగా కూర తయారౌతుంది.
  • నీళ్ళు పోస్తే గ్రేవీ పలుచగా అవుతుంది, రుచి తగ్గుతుంది.

ఇంతకీ ఈ కూరగాయలను ఎలా ఉడికించాలి?

  • తక్కువ మంట మీద మూతపెట్టి ఉడికించాలి. అప్పుడు కూరగాయలు మంచి గ్రేవీ కూరల్లా తయారౌతాయి.
  • మొదట్లో కొంచెం ఉప్పు వేస్తే కూరగాయలు త్వరగా నీళ్ళు వదులుతాయి.
  • మసాలా దోరగా వేగిన తర్వాత కూరగాయలు వేయాలి. అదనపు నీళ్ళు పోయకూడదు.