ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండు..మియాజాకి. జపాన్ వాతావరణంలో మాత్రమే పెరిగే ఈ మామిడి మన దేశంలోనూ పండించేయొచ్చు. ఎక్కువ కష్టపడకుండా ఇలా చేస్తే చాలు.
మొక్కకు త్వరగా కాపు రావాలన్నా, అలాగే తల్లి చెట్టు లక్షణాలు అచ్చంగా అలాగే ఉండాలన్నా.. నమ్మకమైన నర్సరీల నుండి మాత్రమే అంటుకట్టిన మియాజాకి మొక్కలను కొనుగోలు చేయాలి
మియాజాకి మామిడికి దాని ముదురు ఎరుపు రంగు రావాలంటే సూర్యకిరణాలు చాలా ముఖ్యం. రోజుకు కనీసం 6 నుంచి 8 గంటల పాటు నేరుగా ఎండ తగలాలి. అప్పుడే పండు మంచి పక్వానికి వస్తుంది.
నీరు నిలవకూడదు, సేంద్రియ పదార్థాలు ఉన్న నేల దీనికి సరైనది. నేల లేదా డ్రమ్ములు/కుండీలలో పెంచుకోవచ్చు. పశువుల ఎరువు, కంపోస్ట్, వేపపిండి, ఎముకల పొడి కలిపి మట్టిని సిద్ధం చేసుకోవాలి.
కాయలు చిన్నగా ఉన్నప్పుడే ప్రత్యేకమైన బ్యాగులతో కప్పేయాలి. పురుగులు, పక్షుల నుంచి కాయలను కాపాడుతుంది. పండుకు మంచి ఆకర్షణీయమైన రంగు రావడానికి కూడా ఇది సహాయపడుతుంది.