Kitchen Hacks: కిచెన్ లో ఆయిల్ మరకలు ఈజీగా తొలగించాలా? ఇవి రాస్తే చాలు..!
మార్కెట్లో దొరికే ఏవేవో లిక్విడ్స్ వాడినా కూడా ఆ మరకలు తొందరగా వదలవు. మీరు కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతున్నట్లయితే.. వాటిని ఈజీగా వదిలించే పద్దతులు కొన్ని ఉన్నాయి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
కిచెన్ క్లీనింగ్...
ప్రతిరోజూ కిచెన్ లో వంట చేయడం తప్పదు. కానీ.. ఇలా వంట చేస్తున్నప్పుడు కిచెన్ లో టైల్స్ , గోడలు మొత్తం ఆయిల్ మరకలు పడిపోతూ ఉంటాయి. వాటిని వదిలించడం అంత ఈజీ కాదు. మార్కెట్లో దొరికే ఏవేవో లిక్విడ్స్ వాడినా కూడా ఆ మరకలు తొందరగా వదలవు. మీరు కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతున్నట్లయితే.. వాటిని ఈజీగా వదిలించే పద్దతులు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుందామా...
1.ఐస్ క్యూబ్స్, ఉప్పు..
మీ ఇంట్లో ఐస్ క్యూబ్స్, ఉప్పు ఈ రెండూ ఉంటే.. ఈజీగా నూనె మరకలను తొలగించవచ్చు. మీ టైల్స్ పై నూనె మరకలు జిడ్డుగా ఉంటే.. వాటిపై ఐస్ క్యూబ్స్ రుద్దాలి. ఆ తర్వాత దానిపై ఉప్పు రుద్దితే.. ఆ మరకలు ఈజీగా వదులుతాయి.
దీని కోసం, ముందుగా ప్లాట్‌ఫామ్‌ను ఒక గుడ్డతో ఒకసారి శుభ్రం చేయండి. దీనితర్వాత, ప్లాట్‌ఫామ్‌లోని మరకపై ఐస్ క్యూబ్‌లను కొన్ని సెకన్ల పాటు రుద్దండి. తరువాత మురికి ఉప్పు వేసి కాసేపు రుద్దండి.ఇది నూనెను తొలగించడానికి సహాయపడుతుంది. దీని తర్వాత, ప్లాట్‌ఫామ్‌ను డిష్ సబ్బుతో శుభ్రం చేయండి.
2. టీ పొడి, డిష్ వాష్ సోప్..
టీ కాచిన తర్వాత మిగిలిన టీ పొడిని పారేయకండి. వాటితో కిచెన్ లో మరకలను ఈజీగా తొలగించవచ్చు. దీని కోసం.. టీ కాచిన టీ పొడిలో డిష్ వాష్ లిక్విడ్ సోప్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని నూనె మరకలపై వేసి రుద్దాలి. కాసేపు రుద్దిన తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే చాలు. మరకలు ఈజీగా వదులుతాయి.
3. బూడిద,నిమ్మకాయతో
పూర్వ కాలంలో, ప్రజలు పాత్రలను శుభ్రం చేయడానికి బూడిదను ఉపయోగించారు. అదేవిధంగా, ఇది వంటగది ప్లాట్‌ఫామ్‌ను శుభ్రం చేయడంలో కూడా సహాయపడుతుంది. దీనితో పాటు, మీరు నిమ్మకాయ సహాయం కూడా తీసుకోవచ్చు.
ఎలా ఉపయోగించాలి:
కొంచెం బూడిదను తీసుకోండి. దానిలో నిమ్మరసం కలపండి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నిమ్మ తొక్కపై అప్లై చేసి మరకపై రుద్ది కొన్ని నిమిషాలు అలాగే ఉంచండి.తర్వాత తడి గుడ్డతో తుడవండి. మొండి మరకలు కూడా వదులుతాయి.
4. అల్యూమినియం ఫాయిల్,డిష్ వాషింగ్ లిక్విడ్ ..
అల్యూమినియం ఫాయిల్ ను ఒక బంతిలా చేసుకోవాలి. ఇప్పుడు కిచెన్ లో నూనె మరకలు ఉన్న చోట రుద్దాలి. తర్వాత.. డిష్ వాష్ లిక్విడ్ కూడా వేసి రుద్దాలి. తర్వాత క్లాత్ తో శుభ్రం చేస్తే సరిపోతుంది.