MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Food
  • Cucumber: ఫ్రిజ్ లో పెట్టినా కీరదోస పాడైపోతోందా? ఇలా చేస్తే నెలరోజులైనా తాజాగా ఉంటాయి

Cucumber: ఫ్రిజ్ లో పెట్టినా కీరదోస పాడైపోతోందా? ఇలా చేస్తే నెలరోజులైనా తాజాగా ఉంటాయి

Cucumber:  ఎండాకాలంలో వేడికి  కీరదోస తొందరగా పాడైపోతున్నాయా? ఫ్రిజ్ లో పెట్టినా కూడా తాజాగా ఉండట్లేదా?  కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే నెల రోజులు అయినా తాజాగా ఉంచొచ్చు. 

2 Min read
Author : ramya Sridhar
Published : May 18 2026, 10:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కీరదోస
Image Credit : Getty

కీరదోస

ఎండాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే  ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అలాంటి హెల్దీ ఫుడ్స్ లో కీీరదోస ముందు వరసలో ఉంటుంది. సమ్మర్ లో కీరదోస ను సలాడ్ గా ఎక్కువగా తింటూ ఉంటారు. అంతెందుకు బర్గర్, శాండ్ విచ్ లకు కూడా ఇది కావాల్సిందే. అయితే.. ఈ మండే ఎండలకు కీరదోస తొందరగా పాడైపోతుంది. ఫ్రిజ్ లో పెట్టినా కూడా ముడతలు వచ్చేసి వడబడిపోయినట్లుగా మారతాయి.  వడబడిన వాటిని ఎవరికీ తినాలని అనిపించదు. అందుకే… కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే… నెల రోజులైనా కీరదోస తాజాగా ఉంటాయి. ఆ చిట్కాలు ఇప్పుడు చూద్దాం…

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కీరదోసను ఎలా స్టోర్ చేయాలి?
Image Credit : Getty

కీరదోసను ఎలా స్టోర్ చేయాలి?

కీీరదోసను నిల్వ చేయడం కాస్త కష్టమైన పని అనే చెప్పొచ్చు.  ఎందుకంటే.. అవి ఎక్కువ వేడికి, అలాగే ఎక్కువ చలికి కూడా తొందరగా పాడైపోతాయి.  అలా అని రూమ్ టెంపరేచర్ దగ్గర ఉంచితే మెత్తపడిపోతాయి. ఫ్రిజ్ లో సరిగా స్టోర్ చేయకపోయినా పాడైపోయే అవకాశం ఉంది. అందుకే, వీటిని సరైన ఉష్ణోగ్రతలో, సరైన పద్దతిలో నిల్వ చేయడం చాలా అవసరం. అప్పుడే అవి ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.

కీరదోస నెల రోజులైనా ఫ్రెష్ గా ఉండాలంటే.. మనం ఒక చిన్న పద్దతిని అనుసరించాలి. ముందుగా ప్రతి కీరదోసను ఒక పేపర్ టవల్ లో గట్టిగా చుట్టాలి. కొంచెం కూడా బయటకు కనిపించకుండా పేపర్ టవల్ తో చుట్టేయాలి. ఇలా చేయడం వల్ల  వాటి మీద ఉన్న అదనపు తేమను పేపర్ పీల్చుకుంటుంది.

పేపర్ చుట్టిన కీరదోసలను మళ్లీ ఏదైనా ప్లాస్టిక్ లేదా పాలిథిన్ కవర్ లో చుట్టాలి.  దీని వల్ల కీరదోస పాడవ్వకుండా ఉంటుంది. దానికి సరిపడా టెంపరేచర్ దొరుకుతుంది.  ఇదొక్క ట్రిక్ ఫాలో అయితే… ఎక్కువ రోజులు పాడవ్వకుండా తాజాగా ఉంటాయి.

Related Articles

Related image1
Cucumber: కీరదోస చేదుగా ఉందా? ఇలా చేస్తే.. చేదు పోతుంది..!
Related image2
Cucumber : ఎండాకాలంలో కీరదోస ఎందుకు తినాలి? ఏ టైమ్ లో తినాలి?
34
ఫ్రిజ్ లో ఎలా స్టోర్ చేయాలి?
Image Credit : Getty

ఫ్రిజ్ లో ఎలా స్టోర్ చేయాలి?

ఫ్రిజ్‌లో కీరదోసలను  పెట్టేటప్పుడు సరైన చోట పెట్టడం కూడా చాలా ముఖ్యం. ఫ్రిజ్‌లో బాగా చల్లగా ఉండే ప్రదేశంలో పెట్టొద్దు. ముఖ్యంగా కింద భాగంలో పెడితే త్వరగా పాడవుతాయి. ఫ్రిజ్ ముందు వైపు ఉన్న షెల్ఫ్‌లో పెట్టడం ఉత్తమం. అక్కడ ఉష్ణోగ్రత సాధారణంగా ఉంటుంది. ఈ పద్ధతితో దోసకాయలు వారం కన్నా ఎక్కువ రోజులు తాజాగా, కరకరలాడుతూ ఉంటాయి.

44
వీటితో కలిపి స్టోర్ చేయకూడదు...
Image Credit : Pixabay

వీటితో కలిపి స్టోర్ చేయకూడదు...

చిన్న తప్పుల వల్ల కూడా దోసకాయలు త్వరగా పాడవుతాయి. యాపిల్స్, అరటిపండ్లు, టమాటాల వంటి పండ్ల దగ్గర వీటిని పెట్టొద్దు. వాటి నుంచి వచ్చే ఇథిలీన్ గ్యాస్ వల్ల దోసకాయలు త్వరగా పాడవుతాయి. అలాగే, దోసకాయలను కడిగిన వెంటనే నిల్వ చేయకూడదు, ఎందుకంటే అదనపు తేమ వాటిని కుళ్లిపోయేలా చేస్తుంది. ఫ్రిజ్‌లో మూత పెట్టకుండా ఉంచడం, దెబ్బతిన్న దోసకాయలతో కలిపి పెట్టడం, మరీ చల్లని ప్రదేశంలో నిల్వ చేయడం వంటివి చేయకూడదు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే దోసకాయలు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Pulao Tips: బిగినర్స్ కోసం.. పలావ్ పొడిపొడిగా రావాలంటే ఇలా చేయండి
Recommended image2
Paratha: పరోోటా రబ్బరులా సాగుతుందా? ఇలా చేస్తే దూదిలా మెత్తగా వస్తాయి
Recommended image3
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Related Stories
Recommended image1
Cucumber: కీరదోస చేదుగా ఉందా? ఇలా చేస్తే.. చేదు పోతుంది..!
Recommended image2
Cucumber : ఎండాకాలంలో కీరదోస ఎందుకు తినాలి? ఏ టైమ్ లో తినాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved