ఎండాకాలంలో పాలు తొందరగా విరిగిపోతూ ఉంటాయి. అయితే, విరిగిన పాలు పారబోయకుండా, దానితో చాలా వెరైటీలు చేసుకోవచ్చు.   

వేసవిలో పాలు తొందరగా పాడైపోతాయి. 6-8 గంటల్లోనే పాలు విరిగిపోతూ ఉంటాయి.. చాలామంది విరిగిన పాలతో పన్నీర్ చేసుకుంటారు. కానీ పన్నీర్ మాత్రమే కాదు.. ఈ పాలతో  మీరు స్వీట్స్ నుండి కట్లెట్ వరకు చాలా రకాల వంటకాలు చేసుకోవచ్చు. విరిగిన పాలతో చేసుకోగల 7 రకాల ఫుడ్ వెరైటీలేంటో చూద్దామా..

విరిగిన పాలతో 7 వంటకాలు

పన్నీర్

విరిగిన పాలతో చాలా ఈజీగా పన్నీర్ తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి పన్నీర్ చేసుకున్నాక దానితో కూడా  చాలా రకాల వంటలు చేసుకోవచ్చు. రుచిగా కూడా ఉంటాయి.

రసగుల్ల లేదా రసమలై

విరిగిన పాలతో  చేసిన పన్నీర్‌ని కలిపి రసగుల్ల లేదా రసమలై చేసుకోవచ్చు. స్వీట్స్ ఇష్టపడేవారికి ఇది మంచి ఆప్షన్.

పన్నీర్ శాండ్‌విచ్ లేదా కట్లెట్

పన్నీర్‌లో ఉడికించిన బంగాళాదుంప, మసాలాలు, కూరగాయలు కలిపి టిక్కీ లేదా కట్లెట్ చేసుకోవచ్చు. వీటిని షాలో ఫ్రై చేసి చట్నీ లేదా సాస్‌తో తినవచ్చు.

పన్నీర్ ఖీర్

పన్నీర్‌ని పాలలో ఉడికించి ఖీర్ చేసుకోవచ్చు. యాలకులు, డ్రై ఫ్రూట్స్ వేసి రుచికరమైన ఖీర్ తయారుచేసుకోవచ్చు.

పన్నీర్ టోస్ట్

బ్రెడ్ మీద పన్నీర్ రాసి టోస్ట్ చేసుకోవచ్చు. పైన తేనె లేదా పంచదార చల్లి తినవచ్చు.

టేస్టీ గ్రేవీ కూర

ఉల్లిపాయలు, టమాటాలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్‌తో పన్నీర్ కలిపి కూర చేసుకోవచ్చు. దీన్ని పనీర్ భుర్జీలా డ్రైగా లేదా గ్రేవీతో కూడా చేసుకోవచ్చు.

 

View post on Instagram
 

 

సేంద్రియ ఎరువు

పన్నీర్ చేసిన తర్వాత మిగిలిన నీటిని వాడకూడదనుకుంటే, దాన్ని మొక్కలకు ఎరువుగా వాడుకోవచ్చు.