MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Happy Life: కోటీశ్వరులు కాకపోయినా,ఇవి చేస్తే సంతోషంగా ఉండొచ్చు..!

Happy Life: కోటీశ్వరులు కాకపోయినా,ఇవి చేస్తే సంతోషంగా ఉండొచ్చు..!

జీవితంలో తమకు లభించిన వాటిపట్ల  కృతజ్ఞతగా ఉండటం నేర్చుకోవాలి. లేని వాటి గురించి బాధపడకుండా, ఉన్నవాటితో ఎంత ఆనందంగా ఉండాలో  తెలుసుకోవాలి.

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 21 2025, 03:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
How to lead happy life

How to lead happy life


జీవితంలో సంతోషాన్ని కోరుకోనివారు ఎవరూ ఉండరు. అయితే.. కేవలం డబ్బులు ఉన్నవారు మాత్రమే సంతోషంగా ఉండగలం అని అనుకుంటూ ఉంటారు. కానీ.. డబ్బు లేకపోయినా కొన్ని పనులు చేయడం వల్ల కూడా సంతోషంగా ఉండొచ్చు. మరి, ఆ పనులేంటో చూద్దామా..

కృతజ్ఞతగా ఉండటం..
చాలా మంది తమ దగ్గర డబ్బు లేదని, ఖరీదైన భవనాలు లేవని.. ఇలా లేని దాని కోసం నిత్యం బాధపడుతూనే ఉంటారు. ఇలాంటివారు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. అలా కాకుండా.. ఉన్నదానికి తృప్తి చెందడం అలవాటు చేసుకోవాలి. జీవితంలో తమకు లభించిన వాటిపట్ల  కృతజ్ఞతగా ఉండటం నేర్చుకోవాలి. లేని వాటి గురించి బాధపడకుండా, ఉన్నవాటితో ఎంత ఆనందంగా ఉండాలో  తెలుసుకోవాలి. అలా ఆనందాన్ని కలిగించే మూడు విషయాలను ఓ పేపర్ మీద రాయాలి. ఇలా రాయడం వల్ల  మీ జీవితంలో లేని వాటి నుండి సమృద్ధిగా ఉన్న వాటిపై మీ దృష్టిని మారుస్తుంది - తద్వారా మీరు సానుకూలంగా,సంతోషంగా ఉంటారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25


బంధాలు..
ఎవరితో సంబంధం లేకుండా.. ఒంటరిగా జీవించేవారు ఎప్పుడూ అసంతృప్తితోనే ఉంటారు. అలా కాకుండా..మనకంటూ నలుగురు వ్యక్తులు ఉండేలా చూసుకోవాలి. మంచి స్నేహితులు, బంధువులు చుట్టూ ఉంటే సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారు.కాబట్టి, మీ స్నేహితులు ,కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడపండి. మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది.

35


క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి
వ్యాయామం చేయడం వల్ల ఎండార్ఫిన్లు విడుదల అవుతాయని అనేక అధ్యయనాల్లో రుజువైంది.వ్యాయామం కారణంగా మన మెదడుకు సహజంగా, మంచి అనుభూతి కలిగించే హార్మోన్లు విడుదల అవుతాయి. దాని కోసం ప్రతిరోజూ  ప్రతిరోజూ 20 నిమిషాల నడక లేదా తేలికపాటి వ్యాయామం కూడా మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఫలితంగా సంతోషంగా ఉండగలం.


 

45

తగినంత నిద్రపోండి
నిద్ర లేకపోవడం ఒకరి భావోద్వేగ నియంత్రణను ప్రభావితం చేస్తుంది.వారు మరింత ఒత్తిడికి గురవుతారు. కాబట్టి, మీ నిద్ర అలవాట్లను సరిచేసుకోండి.అది మీ మొత్తం శ్రేయస్సును ఎలా సానుకూలంగా మెరుగుపరుస్తుందో చూడండి. ధ్యానం ఒత్తిడి ,ఆందోళనను తగ్గిస్తుంది.ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు. అంతేకాదు, రోజులో కాసేపు అయినా ప్రకృతిలో సమయం గడపడం అలవాటు చేసుకోవాలి.ప్రకృతి సహజ వైద్యం లాంటిది. ఆ ప్రకృతిలో సమయం గడపడం వల్ల ఒత్తిడి తగ్గిస్తుంది.  దీని వల్ల కూడా ప్రశాంతంగా, సంతోషంగా ఉండగలరు.

55


జీవితంలో అర్థవంతమైన లక్ష్యాలను కలిగి ఉండండి
అర్థవంతమైన లక్ష్యాలను నిర్దేశించుకోవడం ,వాటి ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల జీవితంలో లక్ష్యాన్ని చేరుకోవాలనే పట్టుదల పెరగడంతో పాటు.. దానికి చేరువయ్యే సమయంలో ఆనందం కూడా పెరుగుతుంది. వీలైనంత వరకు సోషల్ మీడియా లాంటి వాటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే..వాటిలో చూసి, ఇతరుల్లా తమ జీవితం లేదని పోల్చుకుంటూ ఉంటే సంతోషం కరువౌతుంది. అలా కాకుండా.. ఇతరులతో పోల్చుకోకుండా.. ఉన్నదాంట్లో తృప్తి పడితే మీ జీవితం సంతోషంగా సాగుతుంది. మనం లగ్జరీ కార్లు కొనుక్కోలేకపోవచ్చు. కానీ.. చిన్న చిన్న ఆనందాలను మాత్రం సంబరంగా జరుపుకుంటే.. కచ్చితంగా హ్యాపీ లైఫ్ ని లీడ్ చేసే అవకాశం ఉంటుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
ఆరోగ్యం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Printed Saree: ఆఫీస్ వేర్ కి పర్ఫెక్ట్ గా సూటయ్యే ప్రింటెడ్ చీరలు
Recommended image2
Chapati Dough: చపాతీ పిండి కలిపిన కాసేపటికే నల్లగా ఎందుకు మారుతుంది? తాజాగా ఉండాలంటే ఏం చేయాలి?
Recommended image3
Silver Anklet:భారత్ లో కాకుండా ఏదేశంలో మహిళలు పట్టీలు ధరిస్తారో తెలుసా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved