తను నమ్మి చేసిన కథ విషయంలో ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అంటున్నాడు 'యాత్ర' దర్శకుడు మహి వి రాఘవ్. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా 'యాత్ర' సినిమా రూపొందిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా అన్ని చోట్ల నుండి పాజిటివ్ టాక్ వస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు మహి వి రాఘవ్ ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెబుతూ ఓ ప్రకటన విడుదల చేశాడు.

అందులో.. ''రాజశేఖర్ రెడ్డి గారు, ఆయన అభిమానులు, ఫాలోవర్ల పట్ల నాకు ఎంతో కృతజ్ఞత ఉంది. నా దృష్టిలో ఒక వ్యక్తికి ఇచ్చే గౌరవం కృతజ్ఞత చూపించడమే.. నా మీద ఇంత ప్రేమ చూపిస్తూ సపోర్ట్ చేస్తోన్న ప్రేక్షకులకు, వైఎస్సార్  అభిమానులకు నా నమస్కారాలు'' అంటూ చెప్పుకొచ్చాడు.

ఇంత గొప్ప కథ చెప్పే అవకాశం కల్పించిన సినిమా రంగానికి ధన్యవాదాలు తెలిపారు. విమర్శలను కూడా తాను గౌరవిస్తానని, కానీ నమ్మి చేసిన కథ విషయంలో ఎవరికీ సమాధానం చెప్పాలన్సిన అవసరం లేదని భావిస్తున్నట్లు చెప్పారు. 'యాత్ర' సినిమా చేయడం ఎప్పటికీ గౌరవంగానే భావిస్తానని చెప్పారు.  

'యాత్ర' ఫస్ట్ డే కలెక్షన్లు!

'యాత్ర'కు షాక్.. ఆన్‌లైన్‌లో సినిమా లీక్!

పార్టీకి అమృత పాత్ర కానీ... (‘యాత్ర’ మూవీ రివ్యూ)

యాత్ర సినిమా: సబితా ఇంద్రారెడ్డి పాత్ర హైలైట్

'యాత్ర' మూవీ ట్విట్టర్ రివ్యూ!

యాత్ర ప్రీమియర్ షో టాక్.. జగన్ తో ఎండింగ్ టచ్

‘యాత్ర’: చంద్రబాబు, జగన్ పాత్రల గురించి దర్శకుడు ఇలా

‘యాత్ర’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌: ఆ హీరో చీఫ్ గెస్ట్ గా?

'యాత్ర' కోసం జగన్ వస్తాడా..?

'యాత్ర'కి నో కట్స్!

ఎన్టీఆర్ కి లేని సీన్ వైఎస్ కి ఉందా..?

వైఎస్సార్ బయోపిక్.. పట్టించుకునేవారే లేరా..?

వైఎస్ 'యాత్ర' కోసం మెగాస్టార్ డబ్బింగ్ పాట్లు!

'యాత్ర' బయోపిక్: నిజ పాత్రలో వైఎస్ జగన్!