Asianet News TeluguAsianet News Telugu

బాలయ్య బ్యానర్ లో విశ్వక్‌ సేన్‌.. టైటిల్ ఏంటంటే

ఈ జెనరేషన్ హీరోలు లేడీ గెటప్స్ వేయడం చాలా తక్కువ. ఒకప్పుడు  స్టార్ హీరోలంతా  స్త్రీ వేషం ధరించి నవ్వులు పూయించారు. ఇప్పుడు విశ్వక్ సేన్ అలా కనిపించనుండడం విశేషాన్ని సంతరించుకుంది. 

Vishwak Sen will be seen in a lady avatar
Author
First Published Jun 8, 2023, 12:36 PM IST


సినీ పరిశ్రమలో ఎవరి సపోర్టు లేకుండా తమకంటూ గుర్తింపు పొందిన అతి కొద్దిమంది నటుల్లో విశ్వక్ సేన్ ఒకరు. ఈయన రీసెంట్ గా  ‘దాస్ కా దమ్కీ’ చిత్రంతో సాధించిన విషయం తెలిసిందే. ఈ ఉత్సాహంలో ఆయన మరిన్ని సినిమాలు చేయటానికి సైన్ చేసారు. అందులో విభిన్న పాత్రలలో కనిపించనున్నారు. కొత్త స్క్రిప్టు ,కొత్త గెపట్ లు లేకపోతే చేయనని చెప్పేస్తున్నారు. ఈ క్రమంలోనే త్వరలో విశ్వక్సేన్ ..లేడి గెటప్ లో కనిపించబోతున్నట్లు సమాచారం. బాలయ్యతో భగత్ కేసరి చిత్రాన్ని నిర్మిస్తున్న షైన్ స్క్రీన్స్ వారే  ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తారు. ఈ చిత్రం ద్వారా కొత్త దర్శకుడు పరిచయం కానున్నారు.

అలాగే ఈ చిత్రానికి లీల అనే టైటల్ అనుకున్నట్లు సమాచారం. సెకండాఫ్ లో వచ్చే ఈ లేడీ గెటప్ పాత్ర కోసం బరువు తగ్గి మరీ విశ్వక్సేన్ కనిపించనున్నారు. హీరోలు, ఆడవాళ్లలా కనిపించటం కొత్తేమీ కాదు కానీ ..ఈ సినిమాలో పాయింట్ ఎగ్జైటింగ్ గా ఉంటుందిట. త్వరలోనే ఎనౌన్సమెంట్ వచ్చే అవకాసం ఉందంటున్నారు.

ఇంతకు ముందు  సినిమా ప్రమోషనల్ ఇంటరాక్షన్‌లో హీరో విశ్వక్ ఈ ప్రాజెక్టు గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాల్ని వెల్లడించాడు. అందులో ముఖ్యమైన అంశం ఏంటంటే.. తదుపరి చిత్రంలో తను లేడీ గెటప్ వేయబోతున్నాడు. ఆ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలన్నీ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తాయని చెబుతున్నాడు. ఈ జెనరేషన్ హీరోలు లేడీ గెటప్స్ వేయడం చాలా తక్కువ. ఒకప్పుడు అగ్రహీరోలంతా స్త్రీ వేషం ధరించి నవ్వులు పూయించారు. ఇప్పుడు విశ్వక్ సేన్ అలా కనిపించనుండడం విశేషాన్ని సంతరించుకుంది. 

ప్రస్తుతం Vishwak Sen నటిస్తున్న గామి రిలీజ్ కు రెడీ గా ఉంది.  అలాగే ‘వీఎస్11’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తుండగా.. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విశ్వక్ సేన్ పుట్టిన రోజు సందర్భంగా నేడు (మార్చి 29న) ఈ సినిమా గురించి మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.మరికొన్ని సినిమాలు ప్లానింగ్‌లో ఉన్నాయి. మరి విశ్వక్‌కు లేడీ గెటప్ ఏ స్థాయిలో పేరు తెస్తుందో చూడాలి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios