Asianet News TeluguAsianet News Telugu

టీ స్టాల్ లో సందడి చేసిన విజయ్ దేవరకొండ, రౌడీ హీరో సరికొత్తగా లైగర్ ప్రమోషన్స్

లైగర్ కోసం సరికొత్త ఎత్తులు వేస్తున్నాడు రౌడీ హీరో  విజయ్ దేవరకొండ. ప్రమోషన్స్ కోసం సరికొత్తప్రయత్నాలుచేస్తున్నాడు. అందులో భాగంగానే ఓ టీ స్టాల్ లో సందడి చేశాడు రౌడీ హీరో.

Vijay Devarakonda In Tea Stall at Pune
Author
Hyderabad, First Published Aug 6, 2022, 3:53 PM IST

దాదాపు మూడేళ్లు అవుతుంది విజయ్ దేవరకొండ సినిమాల థియేటర్ లో రాక.. కారణం ఏది అయినా సరే.. రౌడీ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అందుకే ఈసారి సాలిడ్ గా రావాలని ప్లాన్ చేసుకున్నాడు. పాన్ ఇండియ రేంజ్ లో బాక్సాఫీస్ ను టార్గెట్ చేసుకుని లైగర్ సినిమాలో రాబోతున్నాడు. ఈ నెల రిలీజ్ కాబోతున్న ఈసినిమా కోసం కొత్తకొత్తగా చాలా ప్రయోగాలు చేస్తున్నాడు విజయ్. 

విజ‌య్ దేవ‌ర‌కొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో  పాన్ ఇండియా లెవల్లో వస్తున్న సినిమా లైగర్. దేశ వ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.  విజయ్ సరసన బాలీవుడ్ యంగ్ బ్యూటీ  అనన్యా పాండే హీరోయిన్ గా నటించింది. వరల్డ్ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఓ కీలక పాత్ర పోషించారు. ఇక ఇంత మంది తారలు సందడి చేయబోతుండటంతో ఈసినిమా కోసం టాలీవుడ్ తో పాటు దేశ వ్యాప్తంగా ఆడియన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. 

ఈ నెల 25న లైగర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్ ముందు రాబోతోంది.  తెలుగు హిందీతో  పాటు పలు భాషల్లో విడుదలవనుంది. మరోవైపు  రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో.. మూవీ టీమ్... ప్రమోషన్లలో జోరు పెంచింది. హీరోతో పాటు  హీరోయిన్ కూడా వరుసగా ఈవెంట్స్ లో పాల్గోంటున్నారు.  విజయ్, అనన్యా పాండే పలు ఈవెంట్లలో పాల్గొంటూ మూవీని జనాలకు దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నారు. 

ప్రస్తుతం హీరో విజయ్ పూణెలో ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో పూణె సిటీలో గ్రాడ్యుయేట్ చాయ్ వాలి పేరిట ఏర్పాటు చేసిన ఫేమస్ టీ స్టాల్ ను విజయ్ సందర్శించాడు. ఆ టీ స్టాల్ నిర్వాహకులతో ఫొటో దిగిన విజయ్ టీ రుచి చూశాడు. వాళ్లతో సెల్ఫీ తీసుకున్నడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మూవీ ప్రొడక్షన్ యూనిట్ పూరీ కనెక్ట్స్ తమ  అఫీషియల్ సోషల్ మీడియా సైట్ లో అప్ లోడ్ చేశారు. ఈ పిక్స్ ప్రస్తుతం వైరల్ గామారాయి. 

 


అంతకు ముందు కరణ్ జోహార్ షోలో సందడి చేశారు విజయ్ దేవరకొండ, అనన్య పాండే,  రీసెంట్ గా ముంబయ్ లోని లోకల్ ట్రైన్ లో విజయ్ తో పాటు అనన్య పాండే కలిసి దిగిన ఫోటో వైరల్ అయ్యింది.  అంతే కాదు ఈ మధ్యే  ముంబైలో గాడ్ ఫాదర్ సెట్లో మెగాస్టర్ చిరంజీవి, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ను లైగర్ టీమ్ కలిసి సందడి చేసింది. ఇలా తమకు తోచిన డిఫరెంట్ పద్దతుల్లోలైగర్ ప్రమోషన్స్ ను నిర్వహిస్తున్నారు టీమ్. 
 

Follow Us:
Download App:
  • android
  • ios