క్రికెట్ పండగ మొదలైంది. ప్రతీకూల పరిస్థితులు ఉన్నప్పటికీ క్రికెట్ ప్రియుల కోసం అతిపెద్ద ఈవెంట్ ఐపీఎల్ మొదలైపోయింది. ఇప్పటికే రెండు మ్యాచ్ లు పూర్తికాగా ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ పై ఢిల్లీ జట్టు గెలవడం జరిగింది. నేడు ఐపీఎల్ ఈవెంట్ లో మూడో మ్యాచ్ గా సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ తలపడనున్నారు. ఈ నేపథ్యంలో విక్టరీ వెంకటేష్ హోమ్ టీమ్ సన్ రైజర్స్ లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. 

వెంకటేష్ ట్విట్టర్ వేదికగా 'ఆల్ ది బెస్ట్ సన్ రైజర్స్ టీమ్,  మీ ప్రదర్శన సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధం అవుతున్నాను' అని తెలియజేశారు. దీనికి టీమ్ సన్ రైజర్స్ ప్రతి స్పందించారు, స్టాండ్స్ లో మీ సపోర్ట్ మిస్ అవుతున్నాం అని ట్వీట్ చేయడం జరిగింది. క్రికెట్ ప్రియుడు అయిన వెంకటేష్ తరుచుగా క్రికెట్ మ్యాచెస్ కి అటెండ్ అవుతూ ఉంటారు. ఇక హైదరాబాద్ లో జరిగే ప్రతి ఇంటెర్నేషల్ మ్యాచ్ కి ఆయన వెళ్లడం జరుగుతుంది. 

గత ఏడాది ఇంగ్లాండ్ లో జరిగిన వరల్డ్ కప్ మ్యాచెస్ కి వెంకటేష్ వెళ్లడం జరిగింది. ఇక ఐపీఎల్ హోమ్ టీమ్ సన్ రైజర్స్ కి వెంకటేష్ మద్దతుదారుగా ఉన్నారు. సన్ రైజర్స్ మ్యాచెస్ కి ఆయన అటెండ్ కావడంతో పాటు, ఆటగాళ్లలో ఉత్సాహం నింపుతారు. కరోనా నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచెస్ ఆడియన్స్ లేకుండా సాగుతున్నాయి. దుబాయ్ లో ఖాళీ స్టేడియాలలో కేవలం ఆటగాళ్లు మాత్రమే పాల్గొంటున్నారు. ఇండియాలో ఘనంగా జరగాల్సిన ఈ ఈవెంట్ కరోనా కారణంగా దుబాయ్ తరలిపోయింది.