Search results - 294 Results
 • Ashton Turner

  CRICKET23, Apr 2019, 9:24 PM IST

  ఐపిఎల్‌ 2019: రాజస్థాన్ ప్లేయర్ టర్నర్ పేరిట అత్యంత చెత్త రికార్డు

  ఐపిఎల్ సీజన్ 12కి కొద్దిరోజుల ముందు భారత్-ఆస్ట్రేలియా జట్ల మొహాలీలో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఓ ఆస్ట్రేలియన్ యువ కిలాడీ ఆస్టర్ టర్నర్ పేరు మారుమోగింది. భారత్ విసిరిన 359 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో టర్నర్ మ్యాచ్‌లో ట‌ర్న్ చేసి వారి జ‌ట్టుకు విజ‌యాన్నందించాడు. ఇలా కేవలం 43 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో అజేయంగా 84 పరుగులు సాధించి తన సత్తాను చాటుకున్నాడు. అయితే అదే భారత గడ్డపై జరుగుతున్న ఐపిఎల్ లో మాత్రం రాణించలేక అత్యంత చెత్త రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు. ఇలా ఇండియాలోనే పేరు సంపాదించుకుని మళ్లీ అక్కడే ఆ పేరును పొగొట్టుకుంటున్నాడు టర్నర్. 
   

 • Delhi Capitals

  CRICKET23, Apr 2019, 8:12 PM IST

  ఐపిఎల్ చరిత్రలోనే మొదటిసారి... డిల్లీ క్యాపిటల్స్ అరుదైన ఘనత

  డిల్లీ డేర్‌డెవిల్స్ పేరు కాస్తా డిల్లీ క్యాపిటల్స్ గా మారగానే ఆ జట్టు ఫేట్ కూడా మారినట్లుంది. పేట్ అనేబదులు ఆటగాళ్ల  ప్రదర్శన మారిందనాలి. 2008లో ఇండియర్ ప్రీమియర్ ప్రారంభమైన 2008 నుండి జరిగిన 11 సీజన్లలో ఎప్పుడూ సాధించిన మైలురాయికి డిల్లీ చేరుకుంది. ఇలా ఆ జట్టు సీజన్ 12 లో డిల్లీ అభిమానులనే కాదు ఐపిఎల్ అభిమానులందరిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. 

 • CRICKET23, Apr 2019, 7:46 PM IST

  భారత జట్టులో నెంబర్ వన్ ఆటగాడు అతడే: కపిల్ దేవ్

  ఐపిఎల్ సక్సెస్ ఫుల్ జట్టేదంటే చెన్నై సూపర్ కింగ్స్ పేరే ముందుగా వినిపిస్తుంది. అలాగే సక్సెస్ ఫుల్ కెప్టెన్, బ్యాట్ మెన్, వికెట్ కీఫర్ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు మహేంద్ర సిగ్ ధోని. మైదానంలో అతడి మాయాజాలంతోనే చెన్నై సూపర్ కింగ్స్ ఎన్నో అద్భుత విజయాలను అందుకుని పలుమార్లు ఐపిఎల్ ట్రోపీని ముద్దాడగలిగింది. ఇలా తనతో పాటే జట్టుకు కూాడా మంచిపేరుతెచ్చిపెట్టాడు ధోని. 

 • Kane Williamson

  CRICKET23, Apr 2019, 6:26 PM IST

  సన్ రైజర్స్‌కు గట్టి ఎదురుదెబ్బ...కీలక ఓవర్సీస్ ఆటగాడు జట్టుకు దూరం

  ఇటీవల ఐపిఎల్ సక్సెస్ పుల్ జట్టు చెన్నైని ఓడించిన సన్ రైజర్స్ మరోసారి ఆ జట్టుతో మంగళవారం తలపడనుంది. చెన్నై వేదికగా జరగనున్న  ఈ మ్యాచ్ కు ముందే హైదరాబాద్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వ్యక్తిగత కారణాలతో సన్ రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ స్వదేశాని  వెళ్లిపోయాడు. దీంతో చెన్నై మ్యాచ్ కు అతడు దూరమయ్యాడు. 

 • Ricky Ponting Rishabh Pant

  CRICKET23, Apr 2019, 5:11 PM IST

  రిషబ్ పంత్ ప్రపంచ కప్ ఆడటం ఖాయం: రికీ పాంటింగ్

  ఐపిఎల్ లో అద్భుత బ్యాటింగ్ తో అదరగొడుతున్న డిల్లీ క్యాపిటల్స్ యువ క్రికెటర్ రిషబ్ పంత్ పై జట్టు కోచ్, మాజీ ఆసిస్ కెప్టెన్ రికీ పాంటింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. అతడు ఎంత కీలక ఆటగాడో మరోసారి రాజస్థాన్ తో మ్యాచ్ సందర్భంగా నిరూపితమైందని అన్నారు. ఇలాంటి ఆటగాన్ని ప్రపంచ కప్ జట్టులో ఎంపిక చేయకుండా టీమిండియా ఘోరమైన తప్పు చేసిందని పాంటింగ్ అభిప్రాయపడ్డారు. 

 • stokes

  CRICKET23, Apr 2019, 2:14 PM IST

  డిల్లీ-రాజస్థాన్ మ్యాచ్: ఫీల్డ్‌లోనే నవ్వులు పూయించిన స్టువర్ట్ బిన్నీ, స్టోక్స్ (వీడియో)

  ఐపిఎల్...సమ్మర్‌లో క్రికెట్ ప్రియులకు పసందైన ఎంటర్‌టైన్ మెంట్ విందును అందించే మెగా టోర్నీ. ఈ ఐపిఎల్ పేరు చెబితేనే యువతలో జోష్ పెరుగుతుంది. ఇలా ఐపిఎల్ 2019 కూడా అభిమానులకు క్రికెట్ మజాను పంచుతోంది. కేవలం బ్యాట్ మెన్స్ మెరుపులు, బౌలర్ల అద్భుతమైన బౌలింగ్, కళ్లుచెదిరే ఫీల్డింగే కాదు కొన్నిసార్లు మైదానంలో జరిగే కొన్ని సంఘటనలు అభిమానులను అలరిస్తుంటాయి. అలాంటి కామెడీ సంఘటనే సోమవారం డిల్లీ-రాజస్ధాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచులో చోటుచేసుకుంది. 

 • rishabh pant

  SPORTS23, Apr 2019, 11:21 AM IST

  నా మైండ్ లో ఇంకా అదే ఉంది.. వరల్డ్ కప్ సెలక్షన్ పై పంత్

  యువ క్రికెటర్ రిషబ్ పంత్ కి వరల్డ్ కప్ లో ఆడే టీం ఇండియాలో చోటు దక్కుతుందని అందరూ భావించారు. కానీ.. సెలక్టర్లు మాత్రం అనుభవానికి పీటం వేస్తూ.. పంత్ ని కాదని.. దినేష్ కార్తీక్ చోటు కల్పించారు.

 • uppal

  Telangana23, Apr 2019, 10:00 AM IST

  ఉప్పల్ స్టేడియంలో తప్పిన పెను ప్రమాదం

  హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ స్టేడియంలో పెను ప్రమాదం తప్పింది. సోమవారం రాత్రి నగరంలో భారీగా వర్షం కురిసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు, షెడ్స్ కుప్పకూలాయి. 

 • Delhi Capitals DC

  CRICKET23, Apr 2019, 7:31 AM IST

  పంత్ విధ్వంసం..రహానే సెంచరీ వృథా: రాజస్థాన్‌పై ఢిల్లీ విజయం

  యువ ఆటగాడు రిషభ్ పంత్ ధాటికి రాజస్థాన్ రాయల్స్ చేతులేత్తేసింది. ఐపీఎల్‌లో భాగంగా సోమవారం జైపూర్‌లో జరిగిన మ్యాచ్‌లో రాజస్ధాన్ రాయల్స్‌పై  ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది

 • SRH Flag

  CRICKET22, Apr 2019, 9:10 PM IST

  ఐపిఎల్ 2019 ఫైనల్‌ హైదరాబాద్‌లోనే...కీలక మ్యాచులకు విశాఖ ఆతిథ్యం

  ఈ ఐపిఎల్ సీజన్ 12 తెలుగు క్రికెట్ ప్రియులను మరింత ఉర్రూతలూగించనుంది. ఇప్పటికే ఐపిఎల్ లీగ్ దశలో భాగంగా హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం ఆతిథ్యమిచ్చింది. మరికొన్ని మ్యాచులు జరగాల్సి వుంది. వీటినే ప్రత్యక్షంగా చూసే అవకాశం రావడంతో తెలుగు ప్రేక్షకులు సంబరపడిపోతుంటే తాజా వార్తతో వారి పరిస్థితి బూరెల బుట్టలో పడ్డట్లయింది. చెన్నై వేదికగా జరగాల్సిన ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్ కు ఉప్పల్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. కొన్ని కారణాలతో ఈ మ్యాచ్ ను చెన్నై నుండి తరలిస్తున్నట్లు ఐపిఎల్ అధికారులు చెబుతున్నారు. 

 • steyn

  CRICKET22, Apr 2019, 8:38 PM IST

  అశ్విన్ అత్యుత్తమ మన్కడింగ్ బౌలర్...: స్టెయిన్ సెటైర్లు

  ఐపిఎల్ సీజన్ 12లో అత్యంత వివాదాస్పదమైన విషయం మన్కడింగ్. లీగ్ దశలో భాగంగా జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ రాజస్థాన్ రాయల్స్ బ్యాట్ మెన్ బట్లర్ ను మన్కడింగ్ ద్వారా ఔట్ చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. క్రీడా స్పూర్తికి విరుద్దంగా అశ్విన్ వ్యవహరించాడని మాజీ క్రికెటర్లు,  విశ్లేషకులు, అభిమానులు అతడిపై మండిపడ్డారు. తాజాగా  రాయల్ చాలెంజర్ బెంగళూరు బౌలర్ డెల్ స్టెయిన్ కూడా ఈ మన్కడింగ్ వివాదంపై తనదైన స్టైల్లో సెటైర్లు విసిరారు. 

 • Rajasthan Royals

  CRICKET22, Apr 2019, 6:46 PM IST

  రాజస్థాన్‌‌కు షాక్: ఐదుగురు ఓవర్సీస్ ప్లేయర్స్ జట్టుకు దూరం...

  ఐపిఎల్  సీజన 12లో ఇప్పటికే వరుస పరాజయాలతో పాయింట్స్ టేబుల్ చివరన నిలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే ఆ జట్టు స్టార్ బ్యాట్ మెన్ వ్యక్తిగత కారణాలతో జట్టుకు దూరమవగా ఇప్పుడె మరో నలుగురు ఓవర్సీస్ ప్లేయర్స్ కూడా జట్టుకు దూరం కానున్నారు.వన్డే క్రికెట్ ప్రపంచకప్ నేపథ్యంలో విదేశీ ఆటగాళ్లు ఐపిఎల్ నుండి ఒక్కొక్కరుగా వైదొలుగుతున్నారు. ఇలా ఈ నెల 25 లోపు ఐదుగురు విదేశీ ఆటగాళ్లు రాజస్ధాన్ జట్టుకు దూరమవనున్నారు.    

 • dhoni

  CRICKET22, Apr 2019, 4:58 PM IST

  సీఎస్కే కెప్టెన్ ధోని ఖాతాలో మరో అరుదైన ఐపిఎల్ రికార్డ్...

  మహేంద్ర సింగ్ ధోని... భారత క్రికెట్ అభిమానులందరికి ఇష్టమైన ఆటగాడు. కానీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అతడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యునిగా తమిళనాడు రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే ఐపిఎల్ టోర్నీలో అభిమానులు రాష్ట్రాల వారిగా విడిపోయి తమ జట్టుకు, ఆటగాళ్లకు సపోర్ట్ చేస్తుంటారు. కానీ ధోని విషయంలో మాత్రం ఈ పార్ములా పనిచేయడం లేదు. అతడు ఆడుతున్నాడంటే ప్రత్యర్థి జట్టు అభిమానులు కూడా ఆ విధ్వంసకర ఆటతీరుకు ఫిదా అవ్వాల్సిందే. ఇలా ఆదివారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో ధోని ధనాధన్ ఇన్సింగ్స్ చూసి సీఎస్కే అభిమానులే కాదు ప్రత్యర్థి ఆర్సిబి ఫాలోవర్స్ కూడా మెచ్చుకోకుండా వుండలేకపోతున్నారు. 

 • russell

  CRICKET22, Apr 2019, 3:57 PM IST

  నన్ను కేకేఆర్ యాజమాన్యం ఏడిపించింది...అందుకు ఫలితమే ఇది: రస్సెల్స్

  ఆండ్రీ రస్సెల్... కలకత్తా జట్టుకు దొరికిన మిస్సైల్. ఐపిఎల్ లో తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు ఒంటిచేత్తో విజయాలను  అందించి సత్తా చాటుతున్నాడు. బౌలింగ్ లో పరవాలేదనిపిస్తున్నాడు కానీ బ్యాటింగ్ విషయానికి వస్తే ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోస్తూ పరుగులు సునామీ సృష్టిస్తున్నాడు. పూనకం వచ్చినట్లు భారీ షాట్లతో విరుచుకుపడుతూ జట్టుకు విలువైన పరుగులు అందిస్తూ విజయతీరాలకు చేరుస్తున్నాడు. ఇలా ప్రస్తుతం జట్టులో కీలక ఆటగాడిలా మారిన రస్సెల్స్ గతంలో  కేకేఆర్ యాజమాన్యం తనను ఏడిపించిదంటూ సంచలన విషయాన్ని బయటపెట్టాడు. 

 • dhoni

  CRICKET22, Apr 2019, 1:50 PM IST

  ఆ మూడు సింగిల్స్ తీసుంటే: ధోనిపై ఫ్యాన్స్ ఫైర్, కోచ్ వివరణ

  19వ ఓవర్‌లో మూడు సార్లు సింగిల్ తీసే అవకాశం వచ్చినా ధోని తిరస్కరించడం.. విధ్వంసక ఆటగాడైన బ్రావోకి అవకాశం ఇవ్వకపోవడంపై అభిమానులు మహీపై మండిపడుతున్నారు.