Asianet News TeluguAsianet News Telugu

Ennenno Janmala Bandham: వేద చేసిన పనికి సంతోషపడ్డ కుటుంబసభ్యులు.. యష్, వేదలను కలవకుండా చేసిన విన్ని?

Ennenno Janmala Bandham: స్టార్ మాలో ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ టాప్ రేటింగ్ తో ముందుకి దూసుకుపోతుంది. అనురాగం ఉన్నా చిన్నచిన్న అవాంతరాలతో ఒక్కటి కాలేకపోతున్న ఒక జంట కధ ఈ సీరియల్. ఇక ఈరోజు మార్చి 23 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
 

vedaswini family are very happy in todays ennenno janmala bandham serial gnr
Author
First Published Mar 23, 2023, 10:47 AM IST

ఎపిసోడ్ ప్రారంభంలో మీ అనురాగంలోని మీ బాంధవ్యంలోనూ ఏదో లోపం ఉన్నట్లుగా ఉంది ఇక మీ మొక్కుబడి చెల్లనట్లే అంటారు పూజారిగారు. మీరు ఇక త్రాసులోంచి లేవండి ఎంత చెప్పు కూర్చున్నా లాభం లేదు అని యష్తో చెప్తారు పూజారి.  నేను చాలా తులాభారాలు జరిపించను ఇలా ఎప్పుడు జరగలేదు.

మీ జాతకంలో ఏదో లోపం ఉంది అని పూజారి అనటంతో కన్నీరు పెట్టుకుంటుంది వేద. బాధతో సులోచన దేవుడి దగ్గరికి వెళ్లి నా కూతురు జాతకం ఇంతేనా తనని సుఖపడనివ్వమా, దాని కర్మ ఇంతేనా తనకి ఎందుకు ఈ శిక్ష అంటూ కన్నీరు పెట్టుకుంటుంది. తులాభారం విఘ్నమైనట్టే ఇంక ఈ తులాభారాన్ని ఆపేద్దాము అంటారు పంతులుగారు. యష్ త్రాసులోంచి కిందకి దిగబోతాడు.

అప్పుడే వేద ఒక్క నిమిషం ఉండండి అంటూ గబగబా బయటికి వచ్చి అమ్మవారికి దండం పెట్టుకొని నా భర్త అంటే నాకు ప్రాణం. నా భర్త నాకు దూరం అవ్వటం అంటే ప్రాణాన్ని వదిలేసినట్లే, ఈ తులాభారం గెలిచి తీరాలి అంటూ వారి చేతిలో హారతి ఇస్తుంది వేద. అక్కడే ఉన్న పసుపు తాడు ని అమ్మవారి ఆశీర్వచనంతో యష్ దగ్గరికి తీసుకొని వెళ్లి మంగళ వాయిద్యాలు మధ్య కట్టిన తాళికి ప్రత్యామ్నాయంగా ఈ పసుపుతాడు కట్టండి అంటుంది.

యష్ ఆమె మెడలో మూడు ముళ్ళు వేస్తాడు. ఆ వెంటనే వేద మెడలో ఉన్న బంగారు తాళిబొట్టు తీసి త్రాసులో వేస్తుంది. అప్పుడు త్రాసు తూగుతుంది. ఒక్క విన్ని తప్ప అందరూ ఎంతో సంతోషిస్తారు. నీ చిత్తశుద్ధితో ఈ విషమ పరీక్షలో గెలిచావు అద్భుతం అంటూ వేదని మెచ్చుకుంటారు పూజారి గారు. మీ దంపతులు పది కాలాలపాటు పచ్చగా సంసారం చేసుకోవాలి అని దీవిస్తారు.

ఆ తరువాత వేద యష్ ను కిందకి దింపుతుంది. మీ అమ్మాయి కాపురం బాగుండాలని మీరు మొక్కుకున్నా మొక్కు చెల్లినట్లే. ఇక మీ అమ్మాయిని ఈ ప్రసాదాన్ని అందరికీ పంచండి అంటూ బెల్లాన్ని ఇస్తారు. ప్రసాదాన్ని అక్కడ ఉన్న భక్తులందరికీ పంచుతుండగా అక్కడ ఉన్న ఒక బెల్లం చేతిలో పెట్టి గంపెడు కష్టాలని తీర్చుకుందాం అనుకుంటున్నావా అంటుంది. అదేంటమ్మా అలా అంటున్నావు అంటుంది సులోచన.

అనేది నేనే కానీ అనిపించేది ఆ పెద్దమ్మ, కట్ట మైసమ్మ నేను చెప్పేది నిజం. అందరినీ బాగా చూసుకుంటావు నీ మాట పటిక బెల్లం కానీ నిన్ను వెన్నుపోటు పొడిచే వాళ్ళు నీ వెనకే ఉన్నారు. పాము పడగనిడా నీ మీద పడింది. కాటు వేయటానికి ఉంది అంటుంది. అలా అనొద్దమ్మా నా బిడ్డ జీవితం ఇప్పుడిప్పుడే కుదుటపడుతుంది. భర్తతో బిడ్డతో సంతోషంగా ముందుకు నడుస్తుంది అని ఏడుస్తూ చెప్పింది సులోచన.

నీ బిడ్డ బాట పూలబాట కాదు ముళ్ళబాట అడుగడుగునా గండాలుంటాయి. గ్రహణం గడియలు తీసుకొని వచ్చేస్తున్నాయి నీది సీతమ్మ జాతకము. అడుగడుగునా కష్టాలు కన్నీళ్లు అవమానాలు అన్ని వైపులా చుట్టుముడుతూ ఉంటాయి. ఈ గండం గడిచే దాకా గుండె గుబేలు మంటుంది. నీ భర్త బిడ్డ జాగ్రత్త నీ సంసారం జాగ్రత్త అంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఆవిడ.

దీనికి పరిహారమే లేదా అంటూ ఆవిడని వేడుకుంటుంది సులోచన. అంతా ఆ పెద్దమ్మ తల్లి చూసుకుంటుంది అంటూ వెళ్ళిపోతుంది ఆవిడ. ఇప్పుడే ఒక శుభకార్యం జరిగింది ఆ శుభం గురించి ఆలోచించకు, నాకు అమ్మవారి దీవెన ఉంది అంతా మంచే జరుగుతుంది అంటూ తల్లికి ధైర్యం చెబుతుంది వేద. మరోవైపు వేదకి తాళి కట్టడాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాడు విన్ని.

నేను అనుకున్నది ఏంటి ఇక్కడ జరుగుతున్నది ఏంటి నేను అమెరికా నుంచి ఇక్కడికి వచ్చింది ఎందుకు వీళ్ళ తులాభారం చూడటానికా మళ్ళీ మూడు ముళ్ళు వేస్తుంటే మొదటగా తిలకించడానికా అంటూ ఇరిటేట్ అవుతుంటాడు. వేద, యష్ ల మధ్య భయంకరమైన గ్యాప్ క్రియేట్ చేయాలి ఆ గ్యాప్ వాళ్ళ విడాకులకి దారి తీయాలి అందుకోసం ఏం చేయాలి అంటూ ఆలోచిస్తుంటాడు విన్ని.

నీకోసం నేను పిచ్చివాడిని అయిపోతున్నాను నీకు కనిపించడం లేదా, ఆ యష్ లో మాత్రం పనిగట్టుకుని మరి ప్రేమని వెతుక్కుంటున్నావు అంటూ వేద ఫోటో చూస్తూ ఫ్రెస్టేట్ అవుతాడు. అంతలోనే వేద విన్ని వాళ్ళ ఇంటికి వస్తుంది. నేను నీకోసమే ఏడు సముద్రాలు దాటి వస్తే నువ్వు వాడితోనే మళ్ళీ ఏడు అడుగులు వేస్తానంటే ఏంటి, నిన్ను ఆ యష్ ని విడగొట్టకుండా వదలను.

నిన్ను తీసుకొని వెళ్లకుండా ఈ ఇండియా వదిలి వెళ్ళను అనుకుంటాడు యష్. అంతలోనే వేద మాటలు వినబడటంతో తన గది నుంచి బయటికి వస్తాడు విన్ని. తరువాయి భాగంలో వెడ్డింగ్ యానివర్సరీ కోసం ఏర్పాట్లు పూర్తి చేసి వేద కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు యష్. అదే టైంలో విని సడన్గా నాకు ఏదో అయిపోతుంది అంటూ వేదని కంగారు పెడతాడు. నేను ఉన్నాను కదా కంగారు పడకు అంటూ అతని పక్కనే ఉండి సేవలు చేస్తుంది వేద. మీ మ్యారేజ్ యానివర్సరీ రోజు మీ ఇద్దరినీ కలవకుండా చేశాను. దట్ ఇస్ వివిన్ అని నవ్వుకుంటాడు విన్ని. వేద రాకపోవడంతో మూడి అయిపోతాడు యష్.

Follow Us:
Download App:
  • android
  • ios