దర్శకుడు త్రివిక్రమ్ తో కలిసి బన్నీ ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా మొదలుకావాల్సివున్నా.. ఇంకా పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. దానికి గల కారణం సినిమా కథకి సంబంధించిన బన్నీ, త్రివిక్రమ్ లు ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు.

బాలీవుడ్ హిట్ సినిమా 'సోనూ కి టీటూ కీ స్వీటీ' అనే కామెడీ సినిమాను బన్నీ రీమేక్ చేయాలనుకుంటున్నాడు. కానీ త్రివిక్రమ్ కి మాత్రం మరో మంచి కథ రాసుకొని సినిమా చేయాలని ఆలోచన. త్రివిక్రమ్ గత సినిమా కథలపై చాలా విమర్శలు ఉన్నాయి.

కొన్ని నవలలకు రూపమిచ్చిన కథలైతే మరికొన్ని కథలపై కాపీ ముద్రలు పడ్డాయి. ఈసారి కూడా రీమేక్ తీస్తే కథకుడిగా తనపై ఆ ప్రభావం పడుతుందని భయపడుతున్నాడు. అందుకే బన్నీని కన్విన్స్ చేసి కొత్త కథతో సినిమా చేయడానికి ప్రయత్నించి ప్రయత్నించి ఫైనల్ గా అతడిని ఒప్పించాడు.

బన్నీ కూడా రీమేక్ ని పక్కన పెట్టేసి త్రివిక్రమ్ చెప్పిన కొత్త లైన్ పై దృష్టి పెట్టాడట. ప్రస్తుతం దీనికి సంబంధించిన కసరత్తులు జరుగుతున్నాయి. ఈ కారణంగానే సినిమా ఆలస్యమవుతుందని సమాచారం. మరి త్రివిక్రమ్ ఎలాంటి కథను చెబుతాడో చూడాలి!

ఇవి కూడా చదవండి.. 

బన్నికు భలే సమస్య వచ్చిందే..ఇంకో హీరో అర్జెంట్ గా వాంటింగ్

దీపావళి రోజు బన్నీ స్పెషల్ ట్వీట్!

బన్నీ - త్రివిక్రమ్.. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే?

త్రివిక్రమ్-బన్నీ సినిమాలో హీరోయిన్ ఎవరంటే..?

త్రివిక్రమ్ తో బన్నీ పక్కా.. ప్రాజెక్ట్ వివరాలు!

త్రివిక్రమ్ కొత్త చిత్రంలో బన్ని క్యారెక్టర్.. షాకింగ్

హమ్మయ్య.. ఊపిరి పీల్చుకున్న అల్లు అర్జున్!