'నా పేరు సూర్య' సినిమా తరువాత అల్లు అర్జున్ ఇప్పటివరకు తన తదుపరి సినిమా అనౌన్స్ చేయలేదు. త్రివిక్రమ్ కోసం ఆయన ఎదురుచూస్తున్నాడనే 
వార్తలు వచ్చాయి. దానికి తగ్గట్లుగానే త్రివిక్రమ్ 'అరవింద సమేత' పూర్తయిన వెంటనే బన్నీతో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు.

ఆల్మోస్ట్ ఈ కాంబినేషన్ సెట్ అయినట్లే.. డిసంబర్ లో సినిమాను మొదలుపెట్టాలని చూస్తున్నారు. బాలీవుడ్ లో లో వచ్చిన సినిమాకి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు టాక్. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకోబోతున్నారనే విషయంలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ పేరు వినిపిస్తోంది.

'భరత్ అనే నేను' చిత్రంతో తెలుగులో క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ ప్రస్తుతం రామ్ చరణ్-బోయపాటి సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. 'లస్ట్ స్టోరీస్' అనే వెబ్ సిరీస్ లో తన బోల్డ్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీకి తెలుగులో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి.

అల్లు అర్జున్ సినిమాలో కూడా ఈ భామనే తీసుకునే ఛాన్స్ ఉంది. అమ్మడు క్రేజ్ చూస్తుంటే రకుల్, సమంత, రాశిఖన్నా వంటి తారలకి గట్టి పోటీ ఇచ్చేలా ఉంది.  

ఇవి కూడా చదవండి.. 

త్రివిక్రమ్ తో బన్నీ పక్కా.. ప్రాజెక్ట్ వివరాలు!

త్రివిక్రమ్ కొత్త చిత్రంలో బన్ని క్యారెక్టర్.. షాకింగ్

హమ్మయ్య.. ఊపిరి పీల్చుకున్న అల్లు అర్జున్!