Asianet News TeluguAsianet News Telugu

హమ్మయ్య.. ఊపిరి పీల్చుకున్న అల్లు అర్జున్!

డైరెక్టర్ - హీరోల కాంబినేషన్ ఒక్కసారి సెట్టయితే అభిమానుల్లో అంచనాలు అమితంగా పెరుగుతాయి. సినిమా తెరపైకి వచ్చే ముందు బిజినెస్ డీల్స్ కూడా మొదలవుతాయి. అయితే కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లేముందు ఇద్దరిలో ఏ ఒక్కరు డిజాస్టర్ అందుకున్నా కూడా కథ మళ్ళీ మొదటికి వస్తుంది. 

allu arjun trivikram project
Author
Hyderabad, First Published Oct 13, 2018, 5:11 PM IST

డైరెక్టర్ - హీరో కాంబినేషన్ ఒక్కసారి సెట్టయితే అభిమానుల్లో అంచనాలు అమితంగా పెరుగుతాయి. సినిమా తెరపైకి వచ్చే ముందు బిజినెస్ డీల్స్ కూడా మొదలవుతాయి. అయితే కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లేముందు ఇద్దరిలో ఏ ఒక్కరు డిజాస్టర్ అందుకున్నా కూడా కథ మళ్ళీ మొదటికి వస్తుంది. మొన్నటివరకు త్రివిక్రమ్ పరిస్థితి అలానే ఉంది. 

అజ్ఞాతవాసి సినిమాతో అభిమానులు షాక్ అయ్యేలా చేసి గురిజి ఇలాంటి సినిమాలు కూడా చేస్తాడా? అనే కామెంట్స్ వచ్చాయి. ఇకపోతే అందరికంటే ఎక్కువగా బన్నీ మొన్నటివరకు కొంత డైలమాలో ఉన్నాడని టాక్ వచ్చింది. ఎందుకంటే గత కొంత కాలంగా వీరు ఒక సినిమా చేయాలనీ అనుకుంటున్నారు. 

అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ జులాయి - సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు చేశాడు. ఆ సినిమాలు బన్నీకి కూడా మంచి గుర్తింపును తెచ్చాయి. ఇక ఆ తరువాత సరైనోడు - దువ్వాడ జగన్నాథమ్ సినిమాతో మంచి హిట్స్ అందుకున్న బన్నీ ఊహించని విధంగా నా పేరు సూర్య సినిమాతో డిజాస్టర్ చూశాడు. మరో రిస్క్ చేస్తే మార్కెట్ పడిపోతుందని వేరే దర్శకులతో సినిమా చేయడానికి ఒప్పుకోలేదు. కేవలం త్రివిక్రమ్ తో చేయాలనీ ఫిక్స్ అయ్యాడు. 

కానీ ఆజ్ఞాతవాసి రిజల్ట్ కొంచెం అలజడి రేపినప్పటికీ ఇప్పుడు అరవింద సమేత హిట్టవ్వడంతో ఒక్కసారిగా త్రివిక్రమ్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చినట్లు క్లారిటీ వచ్చేసింది. దీంతో బన్నీ ఊపిరి పీల్చుకున్నాడు అని తెలుస్తోంది. ఇక వీరు చేయబోయే సినిమాకు కూడా భారీగా అంచనాలు పెరిగే అవకాశం ఉంటుంది. మరి ముడవసారి కలిసే ఈ కాంబినేషన్ ఎంతవరకు హిట్ అందుకుంటుందో చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios