ప్రస్తుతం అల్లు అర్జున్ ఆలోచనలు అన్నీ తన తదుపరి చిత్రంపై ఉన్నాయి. ముఖ్యంగా ఆ సినిమాలో తనతో పాటు కలిసి  నటించబోయే మరో హీరో ఎవరనేది ఇంకా తేలలేదు. అవును ..బన్ని నెక్ట్స్ చేయబోయే చిత్రంలో ఇద్దరు హీరోలు ఉంటారు. దాంతో ఓ ప్రక్క త్రివిక్రమ్ స్క్రిప్టుని రెడీ చేస్తూంటే మరో ప్రక్క హీరో అన్వేషణలో బన్ని ఉన్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.

పూర్తి వివరాల్లోకి వెళితే... 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' ప్లాఫ్  తర్వాత అల్లు అర్జున్ ఏ సినిమాను అంగీకరించలేదు. ఆచితూచి అడుగులు వేయాలని కథలు వింటూ వచ్చారు. తమిళ దర్శకుడు లింగుస్వామితో ఒక సినిమా, విక్రమ్‌కుమార్ డైరెక్షన్‌లో మరో సినిమా చర్చల దశలోనే బ్రేక్ లు పడ్డాయి. ఏదీ తనకు కనెక్ట్ కాకపోవటంతో తనకు గతంలో రెండు సినిమాల హిట్స్ ఇచ్చిన త్రివిక్రమ్ తో ముందుకు వెళ్లాలని ఫిక్స్ అయ్యారు. అయితే ఆయన చెప్పిన స్టోరీ లైన్ కన్నా ..తను చూసిన హిందీ సినిమా బాగుందని , రీమేక్ చేద్దామనన్నాడు. 

ఆ సినిమా ..సోను కే టిటు కీ స్వీటీ . ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధించింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా యూత్ కు బాగా పట్టింది. దాంతో అల్లు అర్జున్ ఈ సినిమా చేస్తే మళ్లీ తన కెరీర్ గాడిలో పడుతుందని భావించారు. త్రివిక్రమ్ కు ఓ రీమేక్ చేయటం ఇష్టం లేకపోయినా బన్ని మాట కాదనలేక సై అన్నాడు. అంతవరకూ బాగానే ఉంది.

కానీ అసలు సమస్య అంతా ఈ కథలో ఇద్దరు హీరోలకు సమానమైన ప్రాధాన్యత ఉండటం దగ్గరే వచ్చింది. దాంతో అల్లు అర్జున్ తో పాటే కనపడే హీరో ఎవరు అనే విషయం దగ్గరే ఆగింది. ఎవరైనా కమిడియన్ ని పెట్టి లాగేద్దామని త్రివిక్రమ్ ఆలోచన. ఆ మేరకు స్క్రిప్టుకు రిపేర్లు చేసారట. కానీ ఆర్య 2 లా తనతోపాటు చేసే నవదీప్ లాంటి హీరోని పెట్టి చేస్తే బాగుంటుందని బన్ని చెప్తున్నారట. నాని, శర్వానంద్ లాంటి వాళ్లను అడిగితే బాగానే ఉంటుందని కానీ వాళ్లంతా బిజిగా ఉన్నారు. ఏ చేయాలనే డైలమోలో ఉన్నారట. 

సోను కే టిటు కీ స్వీటీ చిత్రాన్ని హిందీలో టీ సిరీస్ సంస్థ నిర్మించింది. లవ్‌రంజన్ దర్శకత్వం వహించారు. కార్తిక్ ఆర్యన్, నుష్రత్‌బరూచా, సన్నీ నిజార్ ప్రధాన పాత్రల్లో నటించారు.