అందరూ అనుకుంటునట్లుగానే దర్శకుడు త్రివిక్రమ్ తో కలిసి అల్లు అర్జున్ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. అది కూడా రీమేక్ కథతోనే అని తెలుస్తోంది.

కొద్దిరోజుల క్రితం బాలీవుడ్ లో విడుదలైన 'సోను కే టిటు కీ స్వీటీ' అనే సినిమా రీమేక్ హక్కులను త్రివిక్రమ్ దక్కించుకోవడంతో బన్నీతో ఈ కథనే తీస్తున్నట్లు ప్రచారం సాగింది. అది ఇప్పుడు నిజమేనని తెలుస్తోంది. బన్నీకి తగ్గట్లుగా కథలో కొన్ని మార్పులు చేసి సినిమాను రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నారు.

డిసంబర్ 11న సినిమా పూజా కార్యక్రమం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనవరి నుండి సినిమా సెట్ మీదకి వెళ్లొచ్చు. ఈ మేరకు నిన్న అల్లు అరవింద్ ఓ మీటింగ్ నిర్వహించి గీతాఆర్ట్స్ కి సంబంధించి కొందరు కీలక వ్యక్తుల సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. నిర్మాత ఎవరనే విషయం ఇంకా తేలలేదు.

ఎవరు ఈ సినిమాని నిర్మించినా.. అందులో గీతాఆర్ట్స్ భాగస్వామ్యం కచ్చితంగా ఉంటుందని మాత్రం తెలుస్తోంది. ఇప్పటికే బన్నీ.. త్రివిక్రమ్ తో కలిసి రెండు సినిమాలు చేశారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఈ సినిమా హ్యాట్రిక్ అవుతుందనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు.  

ఇవి కూడా చదవండి.. 

త్రివిక్రమ్ కొత్త చిత్రంలో బన్ని క్యారెక్టర్.. షాకింగ్

హమ్మయ్య.. ఊపిరి పీల్చుకున్న అల్లు అర్జున్!