స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దీపావళి రోజు స్పెషల్ ట్వీట్ చేసి అభిమానుల్లో ఆనందాన్ని నింపే ప్రయత్నం చేశారు. పండగరోజు శుభాకాంక్షలు చెబుతూ త్వరలోనే శుభవార్త 
చెబుతానని ట్వీట్ చేశాడు.

''ఈ దీపావళి మన జీవితంలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను. నా కొత్త సినిమా అనౌన్స్మెంట్ కోసం ఇన్ని రోజులు ఎదురుచూసిన నా అభిమానులకి ధన్యవాదాలు చెబుతున్నా.. మరికొద్ది రోజుల్లోనే అధికార ప్రకటన వెల్లడిస్తాను. మీరు చూపిస్తున్న ఈ ప్రేమాభిమానులకు ధన్యవాదాలు'' అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.

బన్నీ నటించిన ఆఖరి చిత్రం 'నా పేరు సూర్య' సరైన విజయాన్ని అందించలేకపోయింది. దీంతో తన తదుపరి సినిమా విషయంలో బన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. దాదాపు త్రివిక్రమ్ కాంబినేషన్ లో బన్నీ సినిమా ఫైనల్ అయినట్లే..

ఈరోజు త్రివిక్రమ్ పుట్టినరోజు సంధర్భంగా ఈ సినిమాకి సంబంధించిన అధికార ప్రకటన వస్తుందని ఆశించారు. కానీ బన్నీ ట్వీట్ తో ఈ సినిమా అనౌన్స్మెంట్ కోసం కోసం మరి కొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే అని తెలుస్తోంది!

ఇవి కూడా చదవండి.. 

బన్నీ - త్రివిక్రమ్.. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే?

త్రివిక్రమ్-బన్నీ సినిమాలో హీరోయిన్ ఎవరంటే..?

త్రివిక్రమ్ తో బన్నీ పక్కా.. ప్రాజెక్ట్ వివరాలు!

త్రివిక్రమ్ కొత్త చిత్రంలో బన్ని క్యారెక్టర్.. షాకింగ్

హమ్మయ్య.. ఊపిరి పీల్చుకున్న అల్లు అర్జున్!