సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత ట్విట్టర్ లో ట్రోల్స్ బాగా ఎక్కువయ్యాయి. తమ అభిమాన హీరోని పొగడడంతో పాటు ఆపోజిట్ హీరోలను కించపరుస్తూ ట్వీట్లు చేయడం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు 'యాత్ర' సినిమాను కూడా ఇలానే ట్రోల్ చేస్తున్నారు.

ఇలాంటిదేదో జరుగుతుందనే చిత్ర దర్శకుడు రిలీజ్ కి ముందే ఎన్టీఆర్, వైఎస్సార్ అభిమానులు మాటల యుద్ధానికి దిగకుండా వారిని గౌరవించాలని అన్నారు. కానీ నెటిజన్లు మాత్రం 'యాత్ర'ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ బయోపిక్ సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. ఒక వర్గపు ఆడియన్స్ ఎన్టీఆర్ బయోపిక్ ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో విమర్శలు చేశారు. బాలకృష్ణపై వ్యంగ్యాస్త్రాలు ప్రయోగించారు. ఇప్పుడు వైఎస్సార్ బయోపిక్ ని కూడా వదలలేదు.  

''వైఎస్సార్ మహానుభావుడా..? అతి పెద్ద అవినీతి పరుడు చనిపోగానే గొప్పోడు అయిపోతాడా..?'' అంటూ విమర్శిస్తున్నారు. మరికొందరు సినిమాలో పాజిటివ్ కంటెంట్ మాత్రమే చూపించడంపై మండిపడ్డారు.

''ఒక వర్గం తప్పితే ఎవరూ ఈ సినిమా చూడరని, చేసిన దోపిడీలు.. మూటగట్టుకున్న పాపాలు చూపించారా..?'' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

 

 

యాత్ర సినిమా: సబితా ఇంద్రారెడ్డి పాత్ర హైలైట్

'యాత్ర' మూవీ ట్విట్టర్ రివ్యూ!

యాత్ర ప్రీమియర్ షో టాక్.. జగన్ తో ఎండింగ్ టచ్

‘యాత్ర’: చంద్రబాబు, జగన్ పాత్రల గురించి దర్శకుడు ఇలా

‘యాత్ర’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌: ఆ హీరో చీఫ్ గెస్ట్ గా?

'యాత్ర' కోసం జగన్ వస్తాడా..?

'యాత్ర'కి నో కట్స్!

ఎన్టీఆర్ కి లేని సీన్ వైఎస్ కి ఉందా..?

వైఎస్సార్ బయోపిక్.. పట్టించుకునేవారే లేరా..?

వైఎస్ 'యాత్ర' కోసం మెగాస్టార్ డబ్బింగ్ పాట్లు!

'యాత్ర' బయోపిక్: నిజ పాత్రలో వైఎస్ జగన్!