- Home
- Entertainment
- Boyapati Movies:పవన్ మూవీతో పోటీ పడి అట్టర్ ఫ్లాప్ అయిన బోయపాటి సినిమా ఏంటో తెలుసా.. రెండింటిపై భారీ అంచనాలు
Boyapati Movies:పవన్ మూవీతో పోటీ పడి అట్టర్ ఫ్లాప్ అయిన బోయపాటి సినిమా ఏంటో తెలుసా.. రెండింటిపై భారీ అంచనాలు
పవన్ కళ్యాణ్ సినిమాకి బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఓ చిత్రం పోటీగా రిలీజ్ అయింది. ఆ రెండు సినిమాలు ఏంటి ? ఏ చిత్రం విజయం సాధించింది అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

బోయపాటి శ్రీను సినిమాలు
అఖండ 2 రిలీజ్ కావడంతో దర్శకుడు బోయపాటి శ్రీను గురించి అభిమానుల్లో ఎక్కువగా చర్చ జరుగుతోంది. అఖండ 2 చిత్రంలో బాలకృష్ణని బోయపాటి పవర్ ఫుల్ గా చూపించారు. కానీ ఫస్ట్ హాఫ్ బలహీనంగా ఉందని, యాక్షన్ ఓవర్ డోస్ అయిందని ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉండగా బోయపాటి గత చిత్రాల గురించి కూడా నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. భద్ర చిత్రంతో బోయపాటి శ్రీను దర్శకుడిగా పరిచయం అయ్యారు.
స్టార్ హీరోలతో బోయపాటి చిత్రాలు
ఆ తర్వాత భద్ర తర్వాత బోయపాటి చేసిన సినిమాల్లో యాక్షన్ డోస్ ఎక్కువగా ఉంటుంది. బాలయ్యతో బోయపాటి ఎక్కువగా సినిమాలు చేస్తున్నారు. విధంగా వెంకటేష్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రాంచరణ్ లాంటి స్టార్స్ తో కూడా బాలయ్య సినిమాలు చేశారు. బాలయ్య తెరకెక్కించిన ఒక చిత్రం.. పవన్ కళ్యాణ్ సినిమాకి పోటీగా రిలీజ్ అయింది. ఆ మూవీ మరేదో కాదు ఎన్టీఆర్ దమ్ము.
పవన్ కళ్యాణ్ మూవీకి పోటీగా బోయపాటి చిత్రం
2012 సమ్మర్ లో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రం విడుదలైంది. ఈ చిత్రానికి 2 వారాల ముందు దమ్ము మూవీ వచ్చింది. గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ కాగా.. దమ్ము తీవ్రంగా నిరాశ పరిచింది. కానీ ఈ రెండు చిత్రాలు భారీ అంచనాలతో విడుదలయ్యాయి. దమ్ము సినిమాపై నందమూరి అభిమానులు ఒక రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారు. అంతకు ముందు ఎన్టీఆర్ బాబాయ్ బాలకృష్ణకి బోయపాటి సింహా లాంటి సూపర్ హిట్ మూవీ ఇచ్చారు. భద్ర, తులసి, సింహా ఇలా హ్యాట్రిక్ హిట్స్ కొట్టారు.
గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్
దీనితో దమ్ము కూడా సంచలన విజయం సాధిస్తుంది అని అంతా నమ్మారు. కానీ అందరి అంచనాలు తలకిందులు అయ్యాయి. దమ్ము మూవీ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రంలో త్రిష, కార్తీక హీరోయిన్లుగా నటించారు. ఇక గబ్బర్ సింగ్ విషయానికి వస్తే.. ఈ చిత్రానికి ముందు పవన్ కళ్యాణ్ వరుస ఫ్లాపుల్లో ఉన్నారు. కానీ రిలీజ్ కి ముందు విడుదలైన గబ్బర్ సింగ్ సాంగ్స్ మూవీపై అంచనాలు అమాంతం పెంచేశాయి.
డిజాస్టర్ అయిన దమ్ము
అంచనాలకు తగ్గట్లుగా సినిమా కూడా ఉండడంతో కలెక్షన్ల వర్షం కురిసింది. గబ్బర్ సింగ్ ప్రభంజనంలో దమ్ము మూవీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. 2012లో గబ్బర్ సింగ్ మూవీ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. పవన్ కళ్యాణ్ కి ఇది సాలిడ్ కంబ్యాక్.

