Asianet News TeluguAsianet News Telugu

అరవింద సమేత... బాహుబలి రికార్డులు బద్దలవుతాయ?

త్రివిక్రమ్ - జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన అరవింద సమేత రిలీజ్ కావడానికి ఇంకా ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉంది. టాలీవుడ్ లో ఈ సినిమాపై అంచనాలు మాములుగా లేవు.ఇప్పటికే ట్రైలర్ సాంగ్స్ సినిమాకు మంచి క్రేజ్ ను అందించాయి.

aravinda sametha premier shows advance bookings
Author
Hyderabad, First Published Oct 7, 2018, 10:12 AM IST

 

త్రివిక్రమ్ - జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన అరవింద సమేత రిలీజ్ కావడానికి ఇంకా ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉంది. టాలీవుడ్ లో ఈ సినిమాపై అంచనాలు మాములుగా లేవు.ఇప్పటికే ట్రైలర్ సాంగ్స్ సినిమాకు మంచి క్రేజ్ ను అందించాయి. ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యధిక థియేటర్స్ లో సినిమా రిలిజ్ కానుంది. 

ఓవర్సీస్ లో కూడా సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. తప్పకుండా కొన్ని సెంటర్లలో బాహుబలి రికార్డులు బద్దలవుతాయని టాక్ వస్తోంది. మొదటి సారి త్రివిక్రమ్ - ఎన్టీఆర్ నుంచి సినిమా వస్తుండడంతో ఫస్ట్ వీక్ లోనే కలెక్షన్స్ గట్టిగా వస్తాయని తెలుస్తోంది. ఇక ఓవర్సీస్ లో 10వ తేదీన సాయంత్రం అరవింద సమేత ప్రీమియర్స్ ను ప్రదర్శించనున్నారు. 

ఇప్పటికే 60% థియేటర్స్ లో టికెట్స్ అన్ని అడ్వాన్స్ బుకింగ్ అయ్యాయి. హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తుండడంతో తప్పకుండా ఈ క్రేజీ ప్రాజెక్టు దసరా కి బాక్స్ ఆఫీస్ వద్ద సునామి సృష్టిస్తుందని సినీ ఎనలిస్ట్ లు భావిస్తున్నారు. ఆస్ట్రేలియాలో కూడా సినిమా సందడి మొదలైంది. మరి మొత్తంగా అరవింద సమేత ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి. 

 

Follow Us:
Download App:
  • android
  • ios