Asianet News TeluguAsianet News Telugu

ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైన ‘ది వారియర్’.. ఎప్పుడు? ఎక్కడ?

టాలీవుడ్ ఉస్తాద్ రామ్ పోతినేని - తమిళ దర్శకుడు లింగుస్వామి కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ ‘ది వారియర్’. థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ మూవీ  ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. 
 

The Warriorr coming to OTT, when? where?
Author
Hyderabad, First Published Jul 31, 2022, 4:58 PM IST

టాలీవుడ్ స్టార్ హీరో, ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni), తమిళ డైరెక్టర్ లింగుస్వామి కాంబినేషన్ లో వచ్చిన  అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్ ‘ది వారియర్’. పక్కా కమర్షియల్ హిట్ కొట్టాలని వచ్చిన ఈ చిత్రం కాస్తా బాక్సాఫీసు వద్ద వెనుకంజ వేసినట్టు నివేదికలు తెలుపుతున్నాయి. ఏదేమైనా రామ్ పోతినేని బిగ్ స్క్రీన్ పై తొలిసారిగా పవర్ ఫుల్, మాస్ పోలీస్ ఆఫీసర్ గా మాత్రం తన అభిమానులను, ప్రేక్షకులను అలరించారు. రామ్ -  కృతి శెట్టి అదిరిపోయే డైలాగ్స్, డాన్స్ తో థియేటర్లలో ఆడియెన్స్ తో విజిల్స్ వేయించారు. 

తెలుగు, తమిళంలో రూపొందిన చిత్రం ఈ నెల జూలై 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలివారమే థియేటర్లకు ఆడియెన్స్ ను రప్పించలేకపోవడంతో.. త్వరగానే ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది. ఇప్పటికే ఈ చిత్రం డిజిటల్, శాటిలైట్స్ రైట్స్  ను స్టార్ నెట్ వర్క్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దక్కించుకున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. చిత్రం థియేట్రికల్ గా రిలీజ్ అయిన నెలలోపే ఓటీటీలోకి వస్తోంది. వచ్చే నెల ఆగస్టు 11న  డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. దీంతో రామ్ అభిమానులు ‘ది వారియర్’ను ఓటీటీలో వీక్షించేందుకు ఎదురుచూస్తున్నారు.   

‘ఇస్మార్ట్ శంకర్’తర్వాత  రామ్ మాస్ కంటెంట్లనే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. కానీ ఆ స్థాయిలో సక్సెస్ ను అందుకోవడం సాధ్యం కావడం లేదు. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత వచ్చిన ‘రెడ్’, ‘ది వారియర్’ పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. వారియర్ మరీ దారుణంగా నష్టాలను మిగిల్చినట్టు పలు నివేదికలు తెలుపుతున్నాయి.  ఈ చిత్రంలో యంగ్ హీరోయిన్   కృతి శెట్టి (Krithi Shetty) రామ్ సరసన నటించింది.  శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మాత శ్రీనివాస్ చిత్తూరి నిర్మించారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతం అందించారు.

Follow Us:
Download App:
  • android
  • ios