బాలీవుడ్ లో హీరోయిన్ గా కొన్ని సినిమాల్లో నటించిన తనుశ్రీదత్తా ఆ తరువాత అమెరికా వెళ్లిపోయింది. ఈ మధ్య తిరిగి ముంబైకి వచ్చిన ఈ నటి ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని, తాను కూడా లైంగిక వేధింపులకు గురైనట్లు వెల్లడించింది.

మొదట్లో ఎవరి పేర్లను బయటపెట్టని తనుశ్రీ మెల్లగా తనను వేధించిన వారి పేర్లను మీడియా ముందు చెప్పేసింది. నటుడు నానా పటేకర్, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి వంటి సెలబ్రిటీలు తనను లైంగికంగా వేధించారని చెప్పింది. దీంతో బాలీవుడ్ లో పెద్ద దుమారమే చెలరేగింది.

తనుశ్రీని స్పూర్తిగా తీసుకున్న కొందరు నటీమణులు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను కూడా బయటపెట్టడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో చాలా మంది దర్శకులు, నిర్మాతలు, హీరోల మీద ఆరోపణలు వచ్చాయి. మీటూ ఉద్యమం బాలీవుడ్ లో భారీ ఎత్తున ఉద్యమించడానికి కారణమైన తనుశ్రీ ఇప్పుడు అన్నీ వదిలేసి తిరిగి అమెరికా వెళ్లిపోతున్నట్లు ప్రకటించింది.

ఆమె మాట్లాడుతూ.. ''నా భవిష్యత్తు అక్కడే ఉంది.. నెల రోజులు ఉందామని ముంబై వచ్చా.. కానీ ఇప్పుడు ఐదు నెలలు దాటేసింది'' అంటూ చెప్పుకొచ్చింది. మరి పోలీసులకు ఆమె ఇచ్చిన ఫిర్యాదులు, మీటూ కేసులు ఏమవుతాయో!

సంబంధిత వార్తలు.. 

తనుశ్రీ లీక్స్.. నానా పటేకర్ అసభ్యకర వీడియోలు!

తనుశ్రీ-నానా వివాదంపై శక్తికపూర్ కామెంట్స్!

నాకు ఎలాంటి నోటీసులు రాలేదు.. ఇవన్నీ బెదిరించడానికే: తనుశ్రీదత్తా

హీరో ముందు బట్టలిప్పి నగ్నంగా డాన్స్ చేయమన్నారు.. హీరోయిన్ కామెంట్స్!
ఆ హీరో డాన్స్ భంగిమల గురించి చెప్తానని తప్పుగా ప్రవర్తించాడు.. హీరోయిన్ కామెంట్స్!

నానా పటేకర్ మహిళలను కొడతాడు.. లైంగికంగా వేధిస్తాడు: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

ఆమె చేస్తోన్న ఆరోపణల్లో నిజం లేదు.. తనుశ్రీపై కొరియోగ్రాఫర్ ఫైర్!