సైరా చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్స్ దుమ్మురేపాయి. సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. ప్రీరిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ చేసిన టైటిల్ సాంగ్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. విడుదలకు మరికొన్ని రోజుల సమయం మాత్రమే మిగిలిన ఉన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలకు సిద్ధం అవుతోంది. 

తాజాగా సైరా చిత్రయూనిట్ అభిమానులకు సడెన్ సర్ప్రైజ్ ఇచ్చింది. సైరా చిత్ర సెకండ్ ట్రైలర్ ని కూడా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అందుకు ముహూర్తం కూడా ఖరారైంది. రేపు(గురువారం) ఉదయం 10:30 గంటలకు ట్రైలర్ 2 రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. 

ది బ్యాటిల్ ఫీల్డ్ అనే పేరుతో సెకండ్ ట్రైలర్ రిలీజ్ కాబోతోంది. ఈ ట్రైలర్ లో యుద్ధ సన్నివేశాలని చూపించనున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు హైలైట్ గా నిలవనున్నాయి. 

హాలీవుడ్ కొరియోగ్రాఫర్స్ కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్ ని డిజైన్ చేశారు. మెగా పవర్ స్టార్ రాంచరణ్ దాదాపు 250 కోట్ల బడ్జెట్ తో సైరా చిత్రాన్ని నిర్మించాడు. నయనతార హీరోయిన్ గా నటించగా.. అమితాబ్, తమన్నా, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించారు. 

 

సైరాలో అనుష్క.. మెగా ఫ్యాన్స్ గర్వపడేలా ఆ సీన్.. సురేందర్ రెడ్డి!

'సైరా' కథ నాది.. పరుచూరి బ్రదర్స్ ది కాదు.. దర్శకుడి కామెంట్స్!

సైరా ట్రైలర్, టీజర్ ఎఫెక్ట్.. హిందీలో ఆశ్చర్యపరిచేలా!

'సైరా' ప్రీమియర్ షో కలెక్షన్లు.. రికార్డులు బద్ధలవ్వాల్సిందే!

సైరా : నొస్సం కోట యుద్ధం విశేషాలు 

లీకైంది: ‘సైరా నరసింహారెడ్డి’ మెయిన్ ట్విస్ట్ ఇదే!

మెగాస్టార్ సైరా ఫీవర్: భోజన ప్రియులకు బంపర్ ఆఫర్లు

హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న సైరా టికెట్లు.. బెంగుళూరులో స్పెషల్ షోలు!

సిరివెన్నెల లిరిక్స్.. వాళ్ళిద్దరి వాయిస్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్!

'సైరా' సెన్సార్ కంప్లీట్.. సినిమా రన్ టైం ఎంతో తెలుసా!