నాల్గో వారంలో కంటెస్టెంట్‌ స్వాతి దీక్షిత్‌ ఎలిమినేట్‌ అయ్యారు. మూడో వారంలో వచ్చిన వైల్డ్ కార్డ్ తో వచ్చిన స్వాతి నాలుగో వారంలో ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. ఎలిమినేట్‌ అయ్యాక బిగ్‌ బాస్‌ స్టేజ్‌పైకి వచ్చి ఇంటి సభ్యులపై అభిప్రాయం పేరుతో బండారాలను బయటపెట్టింది. 

కుమార్‌ సాయి నక్కతోక తొక్కినవాడని, సుజాత పుకార్లు పుట్ట అని, అభిజిత్‌కి పోగరు ఉంటుందని, లాస్య అవకాశ వాది అని, అమ్మ రాజశేఖర్‌ నమ్మకద్రోహి అని, మెహబూబ్‌ బాగా అనుసరించేవాడని, ఏమార్చేవారు మోనాల్‌ అని, గంగవ్వ చాడీలు చెబుతుందని, గమ్యం లేని వ్యక్తి అఖిల్‌ అని, నోయల్‌ అమాయకుడని, అందరిని ఈజీగా నమ్ముతాడని పేర్కొంది. 

సోహైల్‌ ఇస్మార్ట్ దొంగ అని, హారిక ట్యూబ్‌లైట్‌ అని,  ఆయనకు కోపం ఎక్కువ అని, అవినాష్‌ తన ఫేవరేట్‌ అని, అతను వేసే జోకులు కొన్నిసార్లు ఇతరులను బాధపెడతాయని పేర్కొంది. అరియాని ఓవర్‌ కాన్ఫిడెన్స్ ఉంటుందని, వి ట్రాన్స్ఫరెన్స్ గా ఉంటుందని, తనకిష్టమని  చెప్పింది. ఇలా అందరి గురించి చెప్పి అందరి గాలీ తీసింది. ఇక బిగ్‌బాంబ్‌లో భాగంగా అమ్మ రాజశేఖర్‌ని నామినేట్‌ చేసింది. ఆయన నెక్ట్స్ వీక్‌ కెప్టెన్సీ పోటీలో ఉండటానికి లేదు. 

ఇక తాను ఎలిమినేషన్‌కి కారణం చెబుతూ, రెండో వారంలో వచ్చానని వాళ్లకి కనెక్ట్ కావడానికి టైమ్‌ పెట్టింది. కొందరు కనెక్ట్ అయ్యారు, కానీ అందరు కాలేదు. దీంతో తనని అంతా యాక్సెప్ట్ చేయలేకపోయారని, అందుకే ఎలిమినేట్‌ అయ్యానని తెలిపింది.