బోల్డ్ బ్యూటీ స్వరభాస్కర్ గురించి పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ చిత్రాలతో స్వర భాస్కర్ పాపులర్ అయింది. బోల్డ్ రోల్స్ లో నటిస్తూ సపరేట్ ఇమేజ్ సొంతం చేసుకుంది.

బోల్డ్ బ్యూటీ స్వరభాస్కర్ గురించి పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ చిత్రాలతో స్వర భాస్కర్ పాపులర్ అయింది. బోల్డ్ రోల్స్ లో నటిస్తూ సపరేట్ ఇమేజ్ సొంతం చేసుకుంది. అలాగే స్వర భాస్కర్ సోషల్ మీడియాలో చేసే కామెంట్స్ పై కూడా తరచుగా ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. స్వర భాస్కర్ తరచుగా మోడీ ప్రభుత్వంపై విమర్సలు చేస్తుండడం చూస్తూనే ఉన్నాం. 

ఇదిలా ఉండగా స్వర భాస్కర్ ఫిబ్రవరి 16న యంగ్ పొలిటీషియన్ ఫహద్ అహ్మద్ ని వివాహం చేసుకుని అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. తన పెళ్లి ఫోటోలని కూడా అభిమానులతో పంచుకుంది. అయితే అంతకు ముందే జనవరి 6న కోర్టు పద్దతిలో తమ వివాహం జరిగినట్లు కూడా స్వర భాస్కర్ పేర్కొంది. 

తన పెళ్లి న్యూస్ ప్రకటించినప్పటి నుంచి స్వర భాస్కర్ పై ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. ఎందుకంటే స్వర భాస్కర్ మతాంతర వివాహం చేసుకుంది. ఫహద్ అహ్మద్ సమాజ్ వాది పార్టీలో యూత్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు. అయితే రీసెంట్ గా స్వర భాస్కర్ తన బోల్డ్ నెస్ ప్రదర్శిస్తూ బాంబు పేల్చింది. 

సోషల్ మీడియాలో తన ఫస్ట్ నైట్ కి సంబంధించిన ఫోటోలని షేర్ చేసింది. పెళ్లి వరకు ఎవరైనా అభిమానులతో ఫోటోలు పంచుకుంటారు. కానీ ఫస్ట్ నైట్ అనేది సీక్రెట్. కానీ స్వర భాస్కర్ కి ఆ పట్టింపులు ఏమీ లేనట్లు ఉన్నాయి. అందుకే ఏకంగా బెడ్ రూమ్ లో తన ఫస్ట్ నైట్ ఆరెంజ్ మెంట్స్ కి సంబందించిన దృశ్యాలని ఫ్యాన్స్ తో పంచుకుంది. 

ఈ ఫోటోలలో బెడ్ రూమ్ ని అందంగా ముస్తాబు చేసి ఉండడం చూడొచ్చు. ఇలాంటి దృశ్యాలు సినిమాల్లో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. స్వర భాస్కర్ షేర్ చేసిన ఈ దృశ్యాలపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది ఫస్ట్ నైట్ అరేంజ్ మెంట్స్ అదిరాయి అని కామెంట్ చేస్తుంటే.. మరికొందరు ఇలా ఫస్ట్ నైట్ రహస్యాలు బయట పెట్టుకుంటారా ఎవరైనా అని ప్రశ్నిస్తున్నారు. 

 వీర్ దే వెడ్డింగ్ చిత్రంలో స్వర భాస్కర్ అసభ్యకరమైన బెడ్ రూమ్ సన్నివేశంలో నటించినప్పటి నుంచి ఆమెపై ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. ట్రోలర్స్ కి స్వర భాస్కర్ అంతే ఘాటుగా సమాధానాలు ఇస్తూనే ఉంది. స్వర భాస్కర్ కి తెలుగు నేపథ్యం కూడా ఉంది. ఆమె తండ్రి చిత్రపు ఉదయ్ భాస్కర్ తెలుగు వ్యక్తి. ఆయన ఇండియన్ నేవి లో కమాండర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఉదయ్ భాస్కర్ గోదావరి జిల్లాలకు చెందిన వ్యక్తి. ఆయా రకంగా స్వర భాస్కర్ తెలుగు అమ్మాయి అనే చెప్పాలి.