రెండు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతతో హాస్పిటల్ లో జాయిన్ అయిన దర్శకుడు కోడి రామకృష్ణ చికిత్స పొందుతూనే మృతి చెందారు.కొద్దిసేపటి క్రితం ఆయన భౌతికకాయాన్ని ఇంటికి తీసుకువచ్చారు. దీంతో టాలీవుడ్ సెలబ్రిటీలు కోడి రామకృష్ణ ఇంటికి చేరుకొని నివాళులు అర్పిస్తున్నారు. 

నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ.. ''చాలా బాధగా ఉంది.. ఎప్పుడూ ఎనర్జిటిక్ గా ఉండేవారు.. ఆయన మరణ వార్త వినగానే షాక్ అయ్యాను. ఆయన కుటుంబానికి నా 
సంతాపం తెలియజేస్తున్నాను''  అంటూ తెలిపారు. 

నటుడు నరేష్ మాట్లాడుతూ.. ''నాకు చిన్నప్పటి నుండి ఆయన తెలుసు. ఆయన దగ్గర పని చేసిన వారంతా పెద్ద దర్శకులు అయ్యారు. నాన్నగారితో ఆయనకి మంచి పరిచయం ఉండేది. ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను'' అని తెలిపారు. 

శ్యాం ప్రదాద్ రెడ్డి మాట్లాడుతూ.. ''ఎన్నో ఏళ్లుగా ఆయనతో ప్రయాణం చేస్తున్నాను. ఇప్పుడు ఆయన లేరనే విషయం నన్ను ఎంతగానో బాధిస్తుంది'' అంటూ తెలిపారు. 

చివరి కోరిక తీరకుండానే..!

రేపు జూబ్లీహిల్స్ లో కోడిరామకృష్ణ అంత్యక్రియలు!

దాసరితో కోడి రామకృష్ణ అనుబంధం!

కోడి రామకృష్ణ మృతిపై చంద్రబాబు సంతాపం!

కోడి రామకృష్ణ కెరీర్ లో మరపురాని చిత్రాలు!

కోడి రామకృష్ణ తలకి గుడ్డ ఎందుకు కట్టుకుంటారంటే..?

ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూత!