టాలీవుడ్ లో అగ్రహీరోలందరితో సినిమాలు చేసి విజయాలు అందుకున్న దర్శకుడు కోడి రామకృష్ణ ఆఖరి కోరిక తీరకుండానే కన్నుమూశారు.

ఆ  కోరిక ఏంటంటే.. బాలకృష్ణతో ఎన్నో సినిమాలు చేసిన కోడి రామకృష్ణ 'విక్రమసింహా' అనే సినిమాను ప్రారంభించి.. సగం సినిమాను పూర్తి చేసి.. ఆ తరువాత మధ్యలోనే సినిమాను వదిలేశారు.

ఈ సినిమా ఎందుకు ఆగిపోయిందనే విషయాన్ని ఆయన ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావిస్తూ... చాలా సింబాలిక్ గా చెప్పారు. అప్పట్లో కనబడకుండా పోయిన మలేషియా విమానాన్ని ఉదాహరణగా చెబుతూ.. ఆ విమానం ఎందుకు పోయింది..? ఎలా పోయింది..? ఎక్కడ పోయిందనే..? విషయాలు ఇప్పటికీ ఎవరికీ తెలియవని అలానే తమ సినిమా కూడా ఎందుకు
ఆగిందో తెలియదని అన్నారు.

ఎక్కడో బ్రేక్ వచ్చిందని.. అరవై శాతం సినిమా పూర్తయిందని.. మిగిలిన షూటింగ్ కూడా పూర్తయ్యేదని గుర్తు చేసుకుంటూ ఎప్పటికైనా ఆ సినిమాను పూర్తి చేసి విడుదల చేస్తామని, అది కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని ఎంతో నమ్మకంగా చెప్పారు. కానీ ఆయన ఆఖరి కోరిక తీరకుండా కన్నుమూశారు. 

రేపు జూబ్లీహిల్స్ లో కోడిరామకృష్ణ అంత్యక్రియలు!

దాసరితో కోడి రామకృష్ణ అనుబంధం!

కోడి రామకృష్ణ మృతిపై చంద్రబాబు సంతాపం!

కోడి రామకృష్ణ కెరీర్ లో మరపురాని చిత్రాలు!

కోడి రామకృష్ణ తలకి గుడ్డ ఎందుకు కట్టుకుంటారంటే..?

ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూత!