Asianet News TeluguAsianet News Telugu

Sunny Leone : ఫ్యాన్స్ కు ‘50 మిలియన్ కిస్సెస్.. హగ్స్’ఇచ్చిన సన్నీ లియోన్.. ఇస్టాలో 50 మిలియన్ ఫాలోవర్స్

బాలీవుడ్ ఐటెం బాంబ్ సన్నీ లియోన్ (Sunny Leone) తన ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్ ఇచ్చింది. సన్నకి కుర్రాళ్లలో ఉన్న ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. అయితే తాజాగా సన్నీ లియోన్ ఇన్ స్టా ఫాలోవర్స్ నెంబర్ 50 మిలియన్ కు చేరుకుంది. దీంతో అందరికీ కిస్సెస్, హగ్స్ తో థ్యాంక్స్ చెప్పింది సన్నీ.
 

Sunny Leone Reached 50 Million Followers In Instagram, Social Media Post..
Author
Hyderabad, First Published Jan 21, 2022, 11:00 AM IST

ఏ సెలబ్రెటీ అయినా ఆనందం పొందాలన్నా.. కొత్త ప్రాజెక్ట్ లతో ముందకు వెళ్లేందుకు జోష్ పెరగాలన్నా అభిమానుల సపోర్ట్ ఎంతో అవసరం. అయితే సన్నీకి ఫ్యాన్స్ ఫాలోయింగ్  కోట్లల్లో ఉన్న విషయం తెలిసిందే.  తను సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వీడియోలు, ఫొటోలను చూసేందుకు నెటిజన్లు ఎంతో ఆసక్తి చూపుతారు. 

అయితే 50 మిలియన్ల ఫాలోవర్స్ ఉండటం మామూలు విషయం కాదు.  ఈ రికార్డ్ చూస్తే సన్నీకి గ్లామర్ ఫీల్డ్ లో ఎంత పాపులారిటీ ఉందో తెలుస్తోంది. ఎప్పటికప్పుడు తన అందాలను విందు చేస్తున్న సన్నీ 50 మిలియన్ ఫాలోవర్స్ ను రీచ్ కావడంతో చాలా ఆనందం వ్యక్తం చేసింది. తన అభిమానులకు హార్ట్లీ థ్యాంక్స్ చెబుతూ సంతోషంలో డ్యాన్స్ కూడా చేసంది. 

అయితే తన ఫాలోవర్స్ 50 మిలియిన్ కు చేరుకున్న సందర్భంగా సన్నీ తన సోషల్ మీడియాలో థ్యాంక్స్ చెబుతూ కొన్ని వీడియోలను ఫోస్ట్ చేసింది. ఈ సందర్భంగా సన్నీ మాట్లాడుతూ ‘హూహూ నా ఇన్ స్టా 50 మిలియిన్ ఫాలోవర్స్ కు చేరుకుంది. నా అందమైన ఇన్ స్టా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నాకు ఇస్టమే. ఇక పార్టీ చేసుకుందాం.’ అంటూ ఒక వీడియోలో తెలిపింది. 

మరో వీడియోలో తనకు 50 మిలియన్ ఫాలోవర్స్ ఉండటం పట్ల చాలా సంతోషం వ్యక్తం చేసింది. అయితే ఈ సందర్భంగా సన్నీ లియోన్  తన 50 మిలియన్  ఫాలోవర్స్ కు .. 50 మిలియన్ హగ్స్, 50 మిలియన్ కిస్సెస్ ఇస్తున్నట్టు తెలిపింది. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sunny Leone (@sunnyleone)

అంతేకాకుండా ఈ సందర్భంగా తన అభిమానులు అడిగిన ఐదు ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పింది. మొదటిది ఒత్తిడికి గురవడం, జీవితంలోని హెచ్చుతగ్గులను తగ్గించేందుకు ఫ్యాన్స్ సపోర్ట్ ఉండటం హ్యాపీ అన్నారు. రెండోది  పోస్టింగ్ పై స్పందిస్తూ ‘ప్రాంక్ వీడియోస్’ను పోస్ట్ చేయడాన్ని ఇష్టపడుతానని తెలిపిందది. మూడోది తన వర్క్ అవుట్ వీడియోను పోస్ట్ చేయడానికి కూడా ఇష్ట పడనన్నారు.  నాలుగోది.. తన ఫాలోవర్స్ చాలా జెన్యూన్ అని, ఫాలోవర్స్ కు తనకు మధ్య చాలా నిజాయితీ గల ప్రయాణం కొనసాగుతోందని తెలిపారు. ఐదోది.. తనకు ఇంత మంది ఫాలోవర్స్ ఉండటం సంతోషమని, ఫాలోవర్స్ ను ఖుషీ చేసేందుకు మరింత కష్టపడుతానని పేర్కొంది.  సన్నీ తర్వాత సినిమాల్లో మెరిసిన మియా మాల్కోవాకు(Mia Malkova) కూడా 10.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

జిస్మ్-2 సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సన్నీలియోన్(Sunny Leone). ఫస్ట్ సినిమాలోనే తన బెస్ట్ పెర్ఫామెన్స్  చూపించేసింది. ఈ సినిమాలో ఆమె చూపించిన అందాలకు కుర్రాళ్ల  గోంతులో తడారిపోయింది. ఇంత అందం ఇంతకాలం ఎక్కడ దాక్కుంది అనిపించేలా సన్నీలియోన్.. దూసుకుపోయింది. ఆతరువాత వరుస అవకాశాలతో దడదడలాడించింది సన్నీ.

బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా సునామీ సృష్టించింది సన్నీలియోన్(Sunny Leone). సౌత్ లో అన్ని భాషల్లో నటించింది. తెలుగులో మంచు మనోజ్(Manchu Manoj) కరెంట్ తీగ, రాజశేఖర్(Rajasekhar) నటించిన గరుడ వేగ సినిమాల్లో.. ఐటమ్ బాంబ్ పేల్చిన సన్నీ లియోన్.. తమిళ,కన్నడ సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. నార్త్ .. సౌత్ అన్న తేడా లేకుండా పాన్ఇండియా క్రష్ గా మారిపోయిన సన్నీ.. ఏజ్ పెరుగుతున్నా కొద్ది క్రేజ్ పెంచుకుంటుంది.  

Follow Us:
Download App:
  • android
  • ios