గత మూడేళ్ళుగా నటి సునీత బోయ వార్తల్లో నిలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ పై, బన్నీ వాసుపై ఆమె పదేపదే ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.
గత మూడేళ్ళుగా నటి సునీత బోయ వార్తల్లో నిలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ పై, బన్నీ వాసుపై ఆమె పదేపదే ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమె ఆరోపణల్ని గీతా ఆర్ట్స్ సంస్థ చట్టపరంగా ఎదుర్కొంటోంది. సునీత మానసిక పరిస్థితి బాగాలేదని కోర్టు ఇప్పటికే ఆమెని ఎర్రగడ్డ ఆసుపత్రికి తరలించారు.
బయటకి వచ్చిన తర్వాత కూడా సునీత బన్నీవాసుపై ఆరోపణలు చేస్తూనే ఉంది. సినిమాల్లో అవకాశం ఇస్తామని మోసం చేశారని బన్నీ వాసుపై ఆమె ఆరోపణలు చేశారు. తాజాగా కొద్ది సేపటి క్రితమే సునీత బోయ మరింతగా తెగించింది. జూబ్లీ హిల్స్ లో గీతా ఆర్ట్స్ కార్యాలయం ఎదుట రోడ్డుపై నగ్నంగా బైఠాయించి నిరసనకు దిగింది.
అక్కడ ఉన్న లేడీస్ కొందరు ఆమెపై వస్త్రాలు కప్పేందుకు ప్రయత్నించారు. తనని మానసికంగా వేధిస్తున్నారు అంటూ సునీత గట్టిగా అరుస్తూ ఆరోపణలు చేసింది. నాలుగు సార్లు ఎర్రగడ్డ ఆసుపత్రికి వెళ్ళాను.. నా నరాలు దెబ్బతిన్నాయి అంటూ అరుస్తూ సునీత నడిరోడ్డుపై హల్ చల్ చేసింది.
గీతా ఆర్ట్స్ సెక్యూరిటీ పోలిసులని సంప్రదించి సునీతపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ ఎదుట సునీత ఇలా రచ్చ చేయడం ఇది తొలిసారి కాదు. గతంలో కూడా ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఆ సమయంలో పోలీసులు ఆమెని అరెస్ట్ చేశారు. సునీత వ్యవహారంపై గీతా ఆర్ట్స్ సంస్థ కానీ, బన్నీ వాసు కానీ మీడియా ముందు మాట్లాడకుండా.. లీగల్ గా చర్యలు తీసుకుంటున్నారు.
