Asianet News TeluguAsianet News Telugu

‘7 డేస్ 6 నైట్స్’: ఎమ్.ఎస్ రాజు మళ్లీ హాట్ గేమ్

ఎమ్ ఎస్ రాజు.. స్టార్ హీరోతో సినిమా చేస్తారని అందరూ భావించారు. కానీ ఆయన తన తదుపరి చిత్రాన్ని త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు సమాచారం.

Sumanth Ashwin Turns Producer, MS Raju  director jsp
Author
hyderabad, First Published Apr 29, 2021, 3:37 PM IST

ఆ మధ్యన ప్రముఖ నిర్మాత ఎమ్.ఎస్ రాజు దర్శకత్వంలో రూపొందిన ‘డ‌ర్టీ హ‌రి’ విడుద‌లైంది. ట్రైలర్స్, టీజర్స్ ఎట్రాక్ట్ చేసేలా ఉండటంతో  సినీ అభిమానులు ప్రత్యేకంగా ఎదురు చూశారు. అయితే సినిమా ఒక వర్గానికే నచ్చాలే..హాట్ సీన్స్ తో ఉంది. కళాత్మకం అని చెప్పినా హాట్ సీన్స్ తో ఫ్యామిలీలు ఈ సినిమాకు దూరంగానే ఉండిపోయారు. ముఖ్యంగా థ్రిల్లింగ్ అంశాల‌తో కూడిన ఎరోటిక్ చిత్రమిది. ఫస్ట్ హాఫ్ సీన్స్ మరీ యీత్ ని ఆక‌ట్టుకునేలా ఉంటాయి. ఈ క‌థ‌కి టార్గెట్  ప్రేక్షకులు ఎవ‌ర‌నే విష‌యంపై  దర్శకుడు ఎక్కువ‌గా దృష్టిపెట్టాడు.

  నిజానికి ఈ క‌థ‌లోయూత్ ని ఆక‌ర్షించే శృంగార భ‌రిత‌మైన అంశాల‌తోపాటు..  థ్రిల్లింగ్ అంశాలకి కూడా చోటుంది. కానీ దర్శకుడు యువ‌త‌రం ప్రేక్షకులను ల‌క్ష్యంగా చేసుకోవ‌డంతో  శృంగార భ‌రిత‌మైన స‌న్నివేశాలే ఎక్కువ‌గా క‌నిపిస్తాయి. ఆ సినిమాకు ఇలాంటి పేరు వచ్చాక కుర్రాళ్లు ఎగబడి చూసారు అన్నారు. బాగా లాభాలు వచ్చాయని చెప్పుకున్నారు. ఆ తర్వాత ఎమ్ ఎస్ రాజు.. స్టార్ హీరోతో సినిమా చేస్తారని అందరూ భావించారు. కానీ ఆయన తన తదుపరి చిత్రాన్ని త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు సమాచారం.

 ఈ సినిమాని సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పైనే ఆయన కుమారుడు సుమంత్ అశ్విన్ ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాకు  ‘7 డేస్  6 నైట్స్’ అనే టైటిల్ పెట్టారట. ఇదో లైట్ హార్టెడ్ కామెడీ అంటున్నారు. ఈ సినిమా కూడా యూత్ నే టార్గెట్ చేసారంటున్నారు. త్వరలోనే ఈ సినిమాని లాంచ్ చేయబోతున్నారట. మరి ఈ సినిమా కూడా హాట్ సీన్స్ తో నిండిపోతుందా లేక కామెడీతో ఉంటుందా చూడాల్సి ఉంది. డర్టీ హరిలో  ఎమ్‌.ఎస్‌.రాజు యువ‌త‌రం ఆలోచ‌న‌ల‌కి తగ్గట్టు క‌థని అల్లుకున్న విధానం మెప్పిస్తుంది. ఎరోటిక్ స‌న్నివేశాల్ని తీసిన విధానం, అక్కడక్కడా మ‌లుపులు మెప్పిస్తాయి. కానీ, క‌థ‌లో బిగి మాత్రం క‌నిపించ‌దు. ఈ సినిమాలో ఆ సమస్యను సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios