Asianet News TeluguAsianet News Telugu

Sudheer Babu : ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ టీజర్ రిలీజ్ .. హ్యాండ్ సమ్ గా కనిపించిన సుధీర్ బాబు..

హార్డ్ వర్కింగ్ యాక్టర్, యంగ్ అండ్ డైనమిక్ హీరో సుధీర్ బాబు వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ‘శ్రీ దేవి సోడా సెంటర్’ మూవీతో మెప్పిన సుధీర్ బాబు త్వరలో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాతో  ఫ్యాన్స్ ను ఖుషీ చేయనున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ అయ్యింది.  
 

Sudheer Babu Upcoming Movie Teaser Released, Social Media Post
Author
Hyderabad, First Published Jan 22, 2022, 5:11 PM IST

మోహన క్రిష్ణ ఇంద్రగంటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో హీరోగా సుధీర్ బాబు, హీరోయిన్ గా టాలీవుడ్ తాజా యాట్రిక్ హీరోయిన్ క్రితి శెట్టి నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ను గతేడాది తెలిపిన చిత్ర యూనిట్, గతేడాది మార్చి 1న సినిమాకు సంబంధించిన ప్రాథమిక షూట్ ను చేసింది. మూవీ డైరెక్టర్ థీమ్, రోమాంటిక్ కామెడీ తో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి తాజాగా టీజర్ ను రీలీజ్ చేశారు. మేకర్స్. 

అప్పటికే పలాస డైరెక్టర్ కరుణ కుమార్ దర్శకత్వంలో హీరో సుధీర్ బాబు నటించిన లాస్ట్ చివరి చిత్రం 'శ్రీదేవి సోడా సెంటర్'ను ప్రేక్షకులకు మరిచిపోకముందే సుధీర్ తన నెక్ట్స్ మూవీని వీలైనంత త్వరగా రిలీజ్ చేసేందుకు యత్నిస్తున్నారు. ఈ మేరకు మేకర్స్ టీజర్ విడుదల చేయగా ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. 

 

కాగా ఈ మూవీకి మోహన క్రిష్ణ ఇంద్రగంటి  దర్శకత్వం వహిస్తుండగా ‘బెంచ్ మార్క్ స్టూడెయోస్’ మరియు మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సినిమాటోగ్రఫీ కోసం పీ.జీ వింద పనిచేస్తున్నారు. వివేక్ సాగర్ సరికొత్త మ్యూజిక్ ను అందిస్తున్నారు. 

‘శ్రీదేవి సోడా సెంటర్’లో ఢిపరెంట్ రోల్ లో చూసిన ప్రేక్షకులను సుధీర్ బాబు ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ మూవీతో ఒక డైరెక్టర్ రోల్ లో కనిపించనున్నారు. తన ఫిట్ నెస్, డ్యాన్స్, డైలాగ్స్ తో విజిల్స్ వేయించేలా చేసే సుధీర్ బాబు, మరోసారి ఫ్యాన్స్ ను ఖుషీ చేయనున్నారు. అయితే ప్రస్తుతం రిలీజైన టీజర్ లో సుధీర్ బాబు చాలా హ్యాండ్ సమ్ గా కనిపిస్తున్నారు.  

‘యాక్షన్, కెమెరా అంటూ’ మంచి జోష్ ను చూపారు సుధీర్ బాబు ఈ టీజర్ లో... మరోవైపు టాలీవుడ్ ను ఊపూపుతున్న క్రితి శెట్టి ఈ మూవీలో కనిపించడంతో  అభిమానులు మరింత ఖుషీ అవుతున్నారు. శ్యామ్ సింగరాయ్, బంగర్రాజు మూవీల్లో తన బ్యూటీతో మైండ్ బ్లాక్ చేసిన ఈ సుందరి, సుధీర్ తో పాటు నటించి  మరోసారి అలరించనుంది. ఈ సినిమాలో ‘రాహుల్ రామక్రిష్ణ’ కూడా తన దైన నటనా శైలితో అదరగొట్టారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన టీజర్, టైటిల్ పోస్టర్లు కూడా ఫ్యాన్స్ ముందుకు వచ్చాయి. తిలకించిన ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios