Asianet News TeluguAsianet News Telugu

కోన వెంకట్ తో శ్రీను వైట్ల రాజీ ?ట్వీట్ అర్దం ఇదేనా

స్టార్ డైరక్టర్ శ్రీను వైట్ల, స్టార్ రైటర్ కోన వెంకట్ ఒక టైమ్ లో  మంచి మిత్రులు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన వెంకీ, ఢీ, రెడీ, దూకుడు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఆగడు సినిమా సమయంలో శ్రీను వైట్ల,  కోన వెంకట్ మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయి. మీడియా ముఖంగా ఒకరినొకరు తిట్టుకున్నారు. విమర్శలు చేసుకున్నారు. 

Srinu Vytla  cherished the Twelve years Ready
Author
Hyderabad, First Published Jun 20, 2020, 7:51 AM IST


కోన వెంకట్ .. శ్రీను వైట్ల కాంబినేషన్లో వచ్చిన సినిమాలు చాలా వరకూ విజయాలను అందుకున్నాయి. అయితే కొంతకాలంగా శ్రీను వైట్ల .. కోన వెంకట్ మధ్య స్నేహ పూర్వకమైన వాతావరణం లేదు. అందువలన శ్రీను వైట్ల సినిమాలకి కోన వెంకట్ పని చేయడం లేదు. గోపి మోహన్ కూడా ఈ టీమ్ తో కలిసి పనిచేయటం లేదు. అయితే ఆ మధ్యన  ఒక ఇంటర్వ్యూలో కోన వెంకట్ మాట్లాడుతూ, శ్రీను వైట్లతో కలిసి పనిచేయడానికి తనకి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పాడు. అంతేకాదు కొన్ని కథలను శ్రీను వైట్ల మాత్రమే హ్యాండిల్ చేయగలడంటూ అభినందించాడు. 


ఇక శ్రీను వైట్ల కూడా ఈగోలు పక్కన పెట్టేసి, కోన వెంకట్ -  గోపీమోహన్ లతో 'ఢీ 2' ,రెడీ 2 చేయాలనే ఉద్దేశంతో రంగంలోకి దిగాడని అంటున్నారు. కొంతమంది సన్నిహితులు వీళ్లందరినీ కలిపే కార్యక్రమాన్ని మొదలు పెట్టినట్టుగా ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. దీనికి నిదర్శనంగా తాజాగా శ్రీను వైట్ల చేసిన ట్వీట్ నిలుస్తుంది. 
 
శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్, జెనీలియా హీరో హీరోయిన్లుగా 2008లో వచ్చిన రెడీ సినిమా ఎంత పెద్ద హిట్  సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాతో కామెడీలో కొత్త ఒరవడి తీసుకొచ్చాడు శ్రీను వైట్ల. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. దీనికి తోడు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం మరో ఆకర్షణ. ఆడియో కూడా సూపర్ హిట్. ఇప్పటికే రెడీ సినిమాలో సాంగ్స్ వినే వారు వుంటారు. అటు రామ్ కు, జెనిలీయాకు ఇటు డైరెక్టర్ శ్రీనువైట్లకు కూడా ఈ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోయే బ్లాక్ బస్టర్. ఇక ఈ సినిమా రిలీజ్ అయి ఈ రోజుతో 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 

ఈ సందర్భంగా శ్రీను వైట్ల సోషల్ మీడియా ద్వారా అప్పటి రోజులను మరోసారి గుర్తుచేసుకున్నారు. 12 ఏళ్లు అంటే నిన్న మొన్న జరిగినట్లుంది. అవి వండ్రఫుల్ రోజులు. ఎనర్జీ స్టార్ రామ్, క్యూట్ జెనీలియా, టీమ్ గోపీ మోహన్, కోన వెంకట్ అందరూ నమ్మారు అంటూ రాసుకొచ్చారు. ఈ ట్వీట్ చూసిన వారంతా మళ్లీ శ్రీను వైట్ల తన పాత మిత్రులతో కలిసేందుకు ఈ ట్వీట్ ద్వారా మెసేజ్ పంపారంటున్నారు.

మరో ప్రక్క రామ్ ..‘స్రవంతి మూవీస్ లో నా మొదటి సినిమా.. టీనేజర్ గా నా లాస్ట్ సినిమా.. ఈ సినిమాతో నా బెస్టీ జెనీలియాను కలిశాను.. శ్రీను వైట్ల గారినుండి చాలా నేర్చుకున్నాను.. దేవి మ్యూజిక్ మ్యాజిక్.. కోన వెంకట్, గోపి మోహన్, బ్రహ్మీ గారి నుండి చిట్టి నాయుడు వరకు బ్రిలియంట్ టీం.. అందరి కాంబినేషన్ వచ్చిన రెడీ 12 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సినిమా నాకు ఎప్పుడూ స్పెషలే అని ట్వీట్ లో పేర్కొన్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios