ఎన్టీఆర్ జీవిత చరిత్రతో చాలా సినిమాలు సిద్ధమవుతున్నాయి. దర్శకుడు క్రిష్.. బాలకృష్ణ ప్రధాన పాత్రలో ఎన్టీఆర్ బయోపిక్ ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. సంక్రాంతి కానుకగా ఈ రెండు భాగాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

అప్పట్లో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను ప్రారంభించి మధ్యలోనే ఆపేశాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. అదే సమయంలో కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కూడా 'లక్ష్మీస్ వీరగ్రంథం' అనే సినిమాను మొదలుపెట్టి అందులో లక్ష్మీపార్వతిగా ఐశ్వర్యారాయ్ ని తీసుకుంటానని సంచలన కామెంట్స్ చేశాడు.

అయితే రామ్ గోపాల్ వర్మ సినిమాను నిలిపి వేయడంతో కేతిరెడ్డి కూడా తన సినిమాని నిలిపివేశాడు. ఇప్పుడు వర్మ తిరిగి సినిమాను ప్రారంభించడంతో మళ్లీ కేతిరెడ్డి తన 'లక్ష్మీస్ వీరగ్రంథం' సినిమాను లైన్ లోకి తీసుకొచ్చాడు. ప్రస్తుతం సినిమాకి సంబంధించిన షూటింగ్ పనులు కూడా ప్రారంభించినట్లు సమాచారం.

అయితే ఈ బయోపిక్ లో లక్ష్మీపార్వతి పాత్రలో శ్రీరెడ్డి నటించబోతుందని చెన్నై వర్గాలు చెబుతున్నాయి. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశానికి ముందుకు జరిగిన అంశాలతో తాను సినిమా చేయబోతున్నట్లు కేతిరెడ్డి గతంలో ప్రకటించాడు.

అయితే ఇప్పుడు శ్రీరెడ్డి టైటిల్ రోల్ పోషిస్తుందనే వార్త వివాదాలకు దారి తీసింది. ఇదే గనుక నిజమైతే.. మరిన్ని వివాదాలు తెర మీదకి రావడం ఖాయం!

సంబంధిత వార్తలు..

లక్ష్మీస్ ఎన్టీఆర్: వెంకన్న మీద ఒట్టు అనుకోకుండా జరిగిందన్న ఆర్జీవీ

వర్మను భయంతో వణికించే విషయం ఇదే!

లక్ష్మీస్ ఎన్టీఆర్: రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన

ఆర్జీవీ ట్వీట్.. ఈ వ్యక్తిని పట్టిస్తే లక్ష ఇస్తాడట!

వర్మ చెప్పింది నిజమే.. బాబు గారి మరో వీడియో చూసారా?

ఆ చంద్రబాబును పట్టేసిన వర్మ!

నాకు ఎన్టీఆర్ కావాలి.. రూ.10 లక్షలు ఇస్తా: రామ్ గోపాల్ వర్మ!

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్2: 'మహానాయకుడు'!

'ఎన్టీఆర్' బయోపిక్ టైటిల్.. @కథానాయకుడు!

రెండు భాగాలుగా 'ఎన్టీఆర్' బయోపిక్!