ఆఫీసర్ సినిమా తరువాత సైలెంట్ గా ఉన్న రామ్ గోపాల్ వర్మ ఊహించని విధంగా ఒక కాంట్రవర్షియల్ సబ్జెక్టుతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ రోజుకో కొత్త విషయాన్నీ వైరల్ చేస్తున్నాడు. ప్రమోషన్స్ చేస్తున్నాడా లేక వివాదాలకు తెరలేపుతున్నాడా? అనేది తెలియడానికి సమయం చాలానే పడుతుంది. 

ఇక లక్ష్మీస్ ఎన్టీఆర్ ఏ ధైర్యంతో వర్మ తెరకెక్కిస్తున్నాడో తెలియదు గాని అతనిలో ఒక కొత్త భయం ఈ మధ్య బాగా కలవరపెడుతోందని క్లారిటీ ఇచ్చాడు. దేవుడు సమాజం బంధాలు ఇలా వేటికి వనకని వర్మ ముసలితనం అంటే భయమని అంటున్నాడు. మంచానికే పరిమితమై ఒక వ్యక్తి మీద ఆధారపడి బ్రతకడమన్నది చాలా భయాన్ని కలిగిస్తోందని గట్టిగా చెప్పేశాడు. 

ఆర్జీవీ వయస్సు ప్రస్తుతం 56. ఇక మరో నాలుగేళ్లు దాటితే ఆరు పదుల్లోకి వచ్చేస్తారని. ఆ భయం వర్మకి ఎంతో దూరంలో లేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే వర్మ మాత్రం అలాంటి పరిస్థితి వస్తే సూసైడ్ చేసుకుంటానని గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు.