విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా అది ఒక సెన్సేషన్ అని మరోసారి నిరూపించాడు. ఎవరు ఊహించని విధంగా వర్మ తన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి ఒక  టెక్నీషియన్ ని ఎంచుకున్నాడు. ఎమ్.ఎమ్.కీరవాణి ఎన్టీఆర్ బయోపిక్ కి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక లక్ష్మీస్ ఎన్టీఆర్ కు ఆయన తమ్ముడు ఎంపికవ్వడం చర్చనీయాంశంగా మారింది. 

అన్నదమ్ములిద్దరూ ఎన్టీఆర్ కు సంబందించిన కథలకు సంగీతం ఇవ్వడం విశేషమని చెప్పాలి. అయితే ఇది మాత్రం అనుకోకుండా జరిగిందని వర్మ చెబుతున్నాడు. లక్ష్మిస్ ఎన్టీఆర్ కు సంగీత దర్శకుడిగా కళ్యాణ్ మాలిక్ ను ఎంపిక చేసినట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపిన వర్మ వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి చెబుతున్నానని ఉద్దేశపూర్వకంగా కీరవాణి ఎన్టీఆర్ సినిమాకు పని చేస్తున్నాడు కాబట్టి ఆయన తమ్ముడు కళ్యాణ్ ను లక్ష్మీస్ ఎన్టీఆర్ కు ఎంపిక చేయలేదని అన్నారు. 

అనుకోకుండా కళ్యాణ్ మాలిక్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపిక చేయడం జరిగిందని వర్మ తన ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. అలాగే కళ్యాణ్ తో దిగిన ఫొటోను కూడా పోస్ట్ చేశారు. ఐతే - ఆంధ్రుడు - అష్టా చమ్మా  - ఊహలు గుసగుసలాడే వంటి సినిమాల ద్వారా కెరీర్ లో మంచి మ్యూజికల్ హిట్స్ అందుకున్న కళ్యాణ్ కు పెద్దగా బ్రేక్ రాలేదు. మరి లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు అతను మ్యూజిక్ ఎలా చేస్తాడో చూడాలి.

 

 

సంబంధిత వార్తలు 

వర్మను భయంతో వణికించే విషయం ఇదే!

లక్ష్మీస్ ఎన్టీఆర్: రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన

ఆర్జీవీ ట్వీట్.. ఈ వ్యక్తిని పట్టిస్తే లక్ష ఇస్తాడట!

వర్మ చెప్పింది నిజమే.. బాబు గారి మరో వీడియో చూసారా?

ఆ చంద్రబాబును పట్టేసిన వర్మ!

నాకు ఎన్టీఆర్ కావాలి.. రూ.10 లక్షలు ఇస్తా: రామ్ గోపాల్ వర్మ!