కరోనా సోకడమే బాలు అకాల మరణానికి కారణం. 74ఏళ్ల బాలు ఎప్పుడూ దీర్ఘకాలిక వ్యాధితో బాధపడ్డ దాఖలాలు లేవు . దీనితో బాలుకు కరోనా సోకడం వెనుక కారణాలను అయన అభిమానులు వెతుకున్నారు. ఐతే సింగర్ మాళవిక కారణంగా బాలుగారికి కరోనా సోకిందని ఒక వార్త సెర్క్యూలేట్ అయ్యింది. కరోనా పాజిటివ్ అని తెలిసి కూడా లాస్య షూటింగ్ లో పాల్గొన్నారని, ఆమె ద్వారానే బాలుకు కరోనా సోకిందని కథనాలు రావడం జరిగింది. 

నేడు బాలు మరణించిన నేపథ్యంలో దీనిపై లాస్య మరోమారు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కొన్ని స్పెషల్ ఎపిసోడ్స్ కొరకు బాలు జులై 30, 31 తారీఖులలో పాల్గొన్నారు. ఆగస్టు 1న బాలు గారు నిరవధిక షూటింగ్స్ వలన అలసిపోయాను, షూటింగ్ కి రాలేను  అని నాకు మెస్సేజ్ పెట్టారు. 5వ తేదీన బాలుగారు తనకు కోవిడ్ సోకినట్లు ప్రకటించారు. నాకు ఆగస్టు 8న కోవిడ్ సోకినట్లు తేలింది. కాబట్టి జులై 30కి ముందే నాకు కరోనా సోకె అవకాశం లేదు. 

మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, నాకు ఐదునెలల పాప ఉంది. అలాగే ఆ షూటింగ్ కి ఐదు నెలల ముందు వరకు బయటికి వెళ్ళలేదు. చాలా జాగ్రత్తగా ఉన్నాము. కాబట్టి నా వలనే బాలుగారికి కోవిడ్ సోకింది అనడంలో ఎటువంటి నిజం లేదు. దయచేసి నమ్మండి అని మాళవిక తెలియజేశారు.