నెయిల్ ఎక్స్ టెన్షన్ వాడితే ఏమౌతుందో తెలుసా
గోర్లు అందంగా కనిపించాలని చాలా మంది అమ్మాయిలు అనుకుంటారు. అందుకే చాలా మంది నెయిల్ ఎక్స్ టెన్షన్స్ ను వాడుతుంటారు. కానీ వీటిని పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందో తెలిస్తే షాక్ అవుతారు.
గోర్లు పొడవుగా, అందంగా కనిపించాలని చాలా మంది పెట్టుడు గోర్లను వాడుతుంటారు. సాధారణంగా నెయిల్ ఎక్స్ టెన్షన్స్ పై నెయిల్ పాలిష్ తో రకరకాల డిజైన్స్ వస్తుంటారు. కొన్నేండ్ల నుంచి ఈ నెయిల్ ఎక్స్ టెన్షన్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. కొంతమంది ఆడవారు ఈ నెయిల్ ఎక్స్ టెన్షన్స్ ను బాగా ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా కాలేజీ అమ్మాయిలు వీటిని రెగ్యులర్ గా వాడుతుంటారు. కానీ మీరు నిజమైన గోళ్ళపై పదేపదే నకిలీ గోర్లును పెట్టుకోవడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. అవేంటంటే?
గోర్లు దెబ్బతింటాయి
నెయిల్ ఎక్స్ టెన్షన్ ను పదేపదే పెట్టుకోవడం వల్ల మీ గోర్లు దెబ్బతింటాయి. నిజానికి నెయిల్ ఎక్స్ టెన్షన్స్ ను పెట్టుకున్నప్పుడు, వాటిని తీసేసెటప్పుడు సహజ గోర్లు సన్నగా మారుతాయి. ఇది మీ గోర్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. మీరు పెట్టుడు గోర్లను తరచుగా పెట్టుకుంటే మీ సహజ గోర్ల పెరుగుదలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అంతేకాదు దీనివల్ల మీ గోర్లు తొందరగా విరిగిపోతాయి. అందుకే గోళ్ల సంరక్షణకు చిట్కాలను తప్పకుండా పాటించండి.
రసాయనాలు
పెట్టుడు గోర్లను పెట్టుకోవడానికి తీసేయడానికి రసాయనాలను ఉపయోగిస్తారు. ఇలా మీరు తరచుగా చేస్తే మీ గోర్లు, చర్మం రెండూ దెబ్బతింటాయి. రసాయనాలు మీ గోర్లు, చర్మంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి.
రంగు పాలిపోయే సమస్య
చాలామంది ఇతరులు వాడిన, తక్కువ ధర నాణ్యతలేని నెయిల్ ఎక్స్ టెన్షన్ ను వాడుతుంటారు. అలాగే మంచి నాణ్యత కలిగిన ఉత్పత్తులను ఉపయోగించరు. దీని కారణంగా గోర్ల రంగు మారుతుంది. ఇలాంటి పరిస్థితిలో మీ సహజ గోళ్లపై చాలా చెడు ప్రభావం పడుతుంది.
అలెర్జీ ప్రతిచర్య
ఈ సమస్య అందరికీ ఉండదు. కానీ కొంతమందికి మాత్రం ఈ సమస్య ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా మీ చర్మం సున్నితంగా ఉంటే పెట్టుడు గోర్లను పెట్టుకోవడానికి ఉపయోగించే రసాయనం వల్ల మీకు అలెర్జీ వచ్చే అవకాశం ఉంది. ఇలా అయితే మీరు పెట్టుడు గోర్లను వాడకపోవడమే మంచిది.