Asianet News TeluguAsianet News Telugu

సైమా అవార్డ్స్ 2022... ఉత్తమ నటుడు రేసులో బాలయ్య, బన్నీ.. మరో నలుగురు కూడా! 

2022 సంవత్సరానికి గానూ సైమా బెస్ట్ యాక్టర్ ఇన్ లీడ్ రోల్ విభాగంలో నామినేషన్స్ ప్రకటించింది. అల్లు అర్జున్, బాలకృష్ణ వంటి టాప్ స్టార్స్ తో పాటు నాలుగు టైర్ టూ హీరోలు అవార్డు కోసం పోటీపడుతున్నారు. 
 

siima 2022 allu arjun balakrishna and four other heroes  nominated
Author
First Published Aug 20, 2022, 4:21 PM IST

సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2022 నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. 2021లో విడుదలైన ఉత్తమ చిత్రాలు, నటులు, సాంకేతిక నిపుణులు అవార్డ్స్ అందుకోనున్నారు. సైమా 2022 నామినేషన్స్ లో పుష్ప, అఖండ, ఉప్పెన, జాతి రత్నాలు సత్తా చాటాయి. తెలుగు నుండి అత్యధిక విభాగాల్లో నామినేట్ అయిన చిత్రాలుగా రికార్డులకెక్కాయి. పుష్ప 12 విభాగాల్లో, అఖండ 10 విభాగాల్లో నామినేట్ కాగా.. ఉప్పెన 8 విభాగాల్లో, జాతిరత్నాలు 8 విభాగాల్లో నామినేట్ కావడం జరిగింది. 

కాగా బెస్ట్ యాక్టర్ లీడింగ్ రోల్ కేటగిరిలో ఆరుగురు హీరోలు పోటీపడుతున్నారు. పుష్ప చిత్రానికి గాను అల్లు అర్జున్, అఖండ చిత్రం నుండి బాలకృష్ణ, లవ్ స్టోరీ చిత్రానికి గానూ నాగ చైతన్య, నాంది చిత్రంలోని నటనకు అల్లరి నరేష్, శ్యామ్ సింగరాయ్ చిత్రం నుండి నాని, జాతి రత్నాలు చిత్రానికి గాను నవీన్ పోలిశెట్టి నామినేట్ అయ్యారు. వీరిలో ఒకరు ఉత్తమ నటుడిగా సైమా అవార్డు అందుకోనున్నారు. 

రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన పుష్ప చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించగా... అల్లు అర్జున్ డీగ్లామర్ రోల్ లో అదరగొట్టారు. అల్లు అర్జున్ స్మగ్లర్ గా చేయగా వరల్డ్ వైడ్ రూ. 360 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ మూవీలో బాలయ్య వీరవిహారం చేశారు. అఘోరగా నట బీభత్సం చేశారు. ఈ మూవీ వరల్డ్ వైడ్ రూ. 120 కోట్ల గ్రాస్ అందుకుంది. 

అలాగే నాంది మూవీతో అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత హిట్ అందుకున్నారు. న్యాయవ్యవస్థలో ఉన్న లోపాలను ప్రశ్నించేదిగా నాంది తెరకెక్కింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ మంచి విజయాన్ని నమోదు చేసింది. మిడిల్ క్లాస్ అబ్బాయిగా నాగ చైతన్య సహజంగా నటించి ఆకట్టుకున్నారు. అలాగే శ్యామ్ సింగరాయ్ మూవీలో నాని రెండు భిన్నమైన పాత్రల్లో ఒదిగిపోయారు. ఇక జాతి రత్నాలు మూవీలో నవీన్ పోలిశెట్టి టైమింగ్ కామెడీతో ఆకట్టుకున్నారు. మరి ఈ ఆరుగురిలో అవార్డు ఎవరు అందుకోనున్నారో చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios