Asianet News TeluguAsianet News Telugu

పునిత్ ను తలుచుకుని బోరున విలపించిన శివరాజ్ కుమార్, బాలయ్య ఓదార్పు

కన్నడ స్టార్ సీనియర్  హీరో శివరాజ్ కుమార్  కన్నీళ్లు పెట్టారు. తన తమ్ముడు పునిత్ రాజ్ కుమార్ ను తలచుకుని బోరున విలపించారు. పక్కనే ఉన్న బాలయ్య ఆయన్ను ఓదార్చే ప్రయత్నం చేశారు. 

Shivarajkumar Emotional  with Puneeth Memorice Balayyas Consolation
Author
First Published Feb 8, 2023, 2:48 PM IST

కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ హీరోగా తెరకెక్కిన సినిమా వేద. ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఈసందర్భంగా తెలుగు వర్షన్ కు సబంధించిన వేద ప్రీ రిలీజ్ ఈవెంట్  ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కు  నటసింహం నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో కన్నడ పవర్ స్టార్.. శివరాజ్ కుమార్ సొదరుడు.. స్వర్గీయ పునీత్ రాజ్ కుమార్ ను తలుచుకుని కన్నీరు మున్నీరు అయ్యారు శివయ్య. పునిత్ కు సబంధించిన ఓ మెమరీని స్క్రీన్ మీద చూసిన శివరాజ్ కుమార్ కన్నీరు ఆపుకోలేకపోయారు. తమ్ముడిని తెరపై చూసి  శివరాజ్ కుమార్ తీవ్ర భాగోద్వేగానికి లోనయ్యాడు. 

ఇక కన్నీరు పెట్టుకుంటున్న శివరాజ్ కుమార్ ని బాలకృష్ణ ఓదార్చి ధైర్యం చెప్పాడు. కాగా  కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది వేద సినిమా. గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయిన ఈ మూవీ కన్నడనాట భారీ కలెక్షన్లు సాధించింది. ఇక ఈక్రమంలో సినిమాను  ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే కన్నడ తరువాత ఆ సినిమాలకు హోప్ ఉన్న తెలుగుపై వేదా టీమ్ దృష్టి పెట్టింది. ఈ సినిమాను ఫిబ్రవరి 10న తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. 

ఇక ఈ మూవీని తెలుగులో భారీ ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు. అందులో భాగంగానే  ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిబ్రవరి 7 మంగళవారం హైదరాబాద్ లో నిర్వహించారు. అంతే కాదు వరుస ఇంటర్వ్యూలతో శివరాజ్ కుమార్ హైదరాబాద్ లో సందడిచేశారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన  శివరాజ్ కుమార్.. ఇలా అన్నారు. నేను ఎమోషనల్ అయ్యినందుకు సారీ. నేను కన్నీరు పెట్టుకోకూడదు అనుకుంటాను  కానీ అప్పు బేబీ పేస్ చూసి కన్నీళ్లు వచేస్తుంటాయి. నాకు వాడు ఒక బేబీ లాంటి వాడు... నేను 13 ఏళ్ళ వయస్సులో ఉన్నప్పుడు  వాడు పుట్టాడు.  అలాంటిది నాకంటే వాడు ముందు వెళ్లిపోవడం ఇప్పటికీ నేను జీర్ణించుకోలేకపోతున్నాను అన్నారు శివరాజ్ కుమార్.

పునీత్ రాజ్ కుమార్ మన మధ్య లేకపోయినా ఆయన స్థానం ఆయనదే..ఆయన స్థాయి ఆయనదే అన్నారు నందమూరి బాలకృష్ణ. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ముఖ్య అతిధిగా వచ్చిన బాలకృష్ణ మాట్లాడుతూ.. పునీత్ రాజ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన కేవలం నటుడు గానే కాదు.. సేవ గుణంతో గొప్ప వ్యక్తిగా అందరి హృదయాల్లో నిలిచిపోయారు. చాలా మంది ఏదైనా మంచి పని  చేస్తే.. మేము ఇది చేశాం.. అది చేశాం అని గొప్పలు చెప్పుకుంటారు. కానీ ఎటువంటి ప్రచారం లేకుండా.. ఎవరిక తెలియకుండా.. తన మనసు తృప్తి పడేలా.. ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు పునిత్  చేశారు. ఆ సేవలే ఆయనని నేడు మన మధ్య చిరస్థాయిగా నిలిచిపోయేలా చేశాయి అని అన్నారు బాలయ్య. 

ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇటు బాలయ్య అభిమానులు.. అటు కన్నడ నుంచి వచ్చిన రాజ్ కుమార్ ఫ్యామిలీ అభిమానులతో సందడి వాతావరణం ఏర్పడింది. ఇద్దరు స్టార్లు మాట్లాడేప్పుడు అభిమానులు బాగా స్పందించారు. పునిత్ రాజ్ కుమార్ గురించి మాట్లాడే సమయంలో అభిమానులు బాగా ఎమోషనల్ అయ్యారు. ఇక శివరాజ్ విలపించడంతో.. అభిమానులు కూడా ఎమోషనల్ గా స్పందిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios