Asianet News TeluguAsianet News Telugu

షకీలా బయోపిక్: మందు గ్లాసులో హీరోయిన్!

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. ఈ క్రమంలో రూపొందుతోన్న కొన్ని బయోపిక్ లు ఎంతో ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి. వాటిలో ఒకప్పటి నటి షకీలా బయోపిక్ ఒకటి. 

shakeela biopic gets a new poster
Author
Hyderabad, First Published Jan 2, 2019, 3:49 PM IST

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. ఈ క్రమంలో రూపొందుతోన్న కొన్ని బయోపిక్ లు ఎంతో ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి. వాటిలో ఒకప్పటి నటి షకీలా బయోపిక్ ఒకటి. ఇంద్రజిత్ లంకేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో షకీలా పాత్రను బాలీవుడ్ బ్యూటీ రిచా చద్దా పోషిస్తోంది.

ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఇప్పటికే విడుదల చేశారు. అందులో బంగారంతో చేసిన దుస్తులు ధరించిన రిచా చద్దా లుక్ అందరినీ ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా నుండి మరో పోస్టర్ ని వదిలారు.

ఈ పోస్టర్ లో 'ఇస్ సాల్ కా జామ్ షకీలా కే నామ్' అంటూ ఓ క్యాప్షన్ కూడా ఇచ్చారు. పోస్టర్ లో సగం మందుతో ఉన్న మద్యం గ్లాస్ లో హీరోయిన్ రిచా చద్దా సగం మునిగి కనిపిస్తోంది. ఈ ఏడాది సమ్మర్ లో సినిమాను విడుదల చేస్తున్నట్లు పోస్టర్ లో ప్రకటించారు.

ఈ పోస్టర్ లో రిచా చద్దా గెటప్ 90ల కాలానికి చెందినట్లుగా ఉంది. ఇది కేవలం ఒక పోర్న్ స్టార్ జీవితం మాత్రమే కాదని, ప్రేక్షకులకు తెలియని ఎన్నో విషయాలను ఈ సినిమాలో చూపించబోతున్నట్లు దర్శకుడు చెబుతున్నాడు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios