బాలీవుడ్ సినిమాల్లో అవసరమైతే న్యూడ్ సీన్స్ మాత్రమే కాక... అందాల ప్రదర్శన, లిప్ లాక్ సీన్స్, బికినీ షోలతో విచ్చలవిడి శృంగారం సహజంగా మారింది. ఇక ఐటమ్ సాంగ్స్ విషయంలో టూ పీస్ డ్రెస్లో బాలీవుడ్ ముద్దుగుమ్మలు ఒకరిని మించి ఒకరు అంగాగ ప్రదర్శన చేస్తున్నారు. అయితే ఇంతకుముందు ఈ ఐటమ్ సాంగ్స్ లో నటించేందుకు మోడల్స్ని రంగంలోకి దించేవారు. అయితే ప్రతి సినిమా లోనూ ఐటమ్ సీజన్ నడుస్తుండటంతో బాలీవుడ్తో పాటు టాలీవుడ్లోనూ ఐటమ్ సాంగ్స్ చేసేందుకు స్టార్ హీరోయిన్లు ‘బావల సయ్యా’ అనేందుకు రెడీ అవుతున్నారు.

 

అయితే వెండితెరపై వెలుగుల పేరుతో అందాల ఆరబోతకు హీరోయిన్స్ అన్ లిమిటెడ్ బోర్డు పెట్టేస్తుండటంతో అశ్లీలతకు బ్రేక్ పడాల్సిన అవసరం ఉందంటున్నారు సీనియర్ నటీమణి షబానా అజ్మీ. ఇటీవల జరిగిన ఎఫ్ఐసీసీఐ సమావేశంలో మాట్లాడుతూ.. ఈ మధ్య కాలంలో సినిమాల్లో అశ్లీలత పరాకాష్టకు చేరిందని, ముఖ్యంగా ఐటమ్ సాంగ్ల పేరుతో విచ్చిలవిడిగా అందాల ఆరబోతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారంటూ మండిపడ్డారామె. ఈ సందర్భంగా దబాంగ్ 2 చిత్రంలో కరీనా పెర్ఫామ్ చేసిన ఫెవికాల్ సే ఐటెం సాంగ్ గురించి ప్రస్తావిస్తూ.. ఆ పాటలో కరీనా కపూర్.. బొడ్డు, నడుము అదే పనిగా చూపిస్తూ నడుము ఊపడం, కెమెరా తదేకంగా చూపడం వంటి తీవ్ర అభ్యతరకరమైన షాట్స్తో ఫ్యామిలీ ఆడియన్స్ ను ఇబ్బందులకు గురిచేసిందన్నారు.

 

 

 

ఇలాంటి ఐటమ్ సాంగ్స్ను చూసిన చిన్నపిల్లలు వాళ్ల మాదిరే డాన్స్ చేస్తున్నారని.. ఇవి వారిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయన్నారు. దీనికి ఐటమ్ సాంగ్స్లో అందాల ఆరబోసే కరీనా కపూర్ లాంటి వాళ్లు బాధ్యత వహించాల్సిదే అంటూ మండి పడ్డారు షబానా అజ్మీ. ఇక బికినీ షోలతో మరీ మితిమీరి ప్రవర్తిస్తున్నారంటూ ‘జిందగీ నా మిలేగే దుబారా’ చిత్రంలో కత్రినా కైఫ్ ధరించిన బికినీ చాలా అసభ్యంగా ఉందని, ఇవి పిల్లలపై ప్రభావం చూపే అవకాశం ఉందనే విషయాన్ని టాప్ హీరోయిన్లు గమనించాలంటూ చురకలంటించారు షబానా అజ్మీ.